వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి అమరావతి రాజధాని ప్రాంతం నిర్మాణ యోగ్యం కాదని, మునిగిపోతుందని కొన్నాళ్లపాటు వాదించారు. వరదల సమయంలో చంద్రబాబు ఇల్లు మునిగిపోతుందని కొందరు నాయకులు కాపలాకాసిన ఫొటోలూ వైరల్ అయ్యాయి. నోటీసులూ జారీ అయ్యాయి. ఒక మాటలో చెప్పాలంటే..అసలు అమరావతిని రాజధాని గా ఎంపిక చేయడమే తప్పు అన్నట్లుగా వైసీపీ ప్రభుత్వం గతంలో ప్రచారం చేసింది. ఇన్ సైడ్ ట్రేడింగ్, సామాజిక వర్గాలను టార్గెట్ చేయడం, ఎస్సీలపైనే అట్రాసిటీ కేసు పెట్టడం..ఇలా చాలా వివాదాలు చోటుచేసుకున్నాయి. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ జరుగుతున్న ధీక్షను భగ్నం చేసేందుకుకూడా ప్రయత్నాలు జరిగాయి. అయినా ఆ దీక్ష 439రోజులుగా నడుస్తూనే ఉంది. ఇక పోటీగా మరో దీక్షకూడా నడుస్తున్నా.. ఒక వైసీపీ తప్ప..పెద్దగా మద్దతు లేదనే వాదన కూడా ఉంది.
ఈ పరిణామాలు ఇలా ఉంటే.. నిన్న అమరావతి ప్రాంతంలో భూ ప్రకంపనలు, పరుగులు తీసిన జనం అనే వార్త ఓ మీడియాలో చాలా ప్రాధాన్య అంశంగా ప్రసారమైంది. అందుకు తగినట్టుగానే ఆ వర్గ సోషల్ మీడియా కూడా ప్రచారం చేసింది. తీరా అసలు విషయానికి వస్తే.. కర్లపూడిలో క్వారీ పేలుళ్ళతో వచ్చిన ప్రకంపనలు అని తేలినట్లు స్థానికులు చెబుతున్నారు. రిక్టర్ స్కేలుపైనా ప్రకంపనలు రికార్డు కాలేదు. ప్రస్తుతం ఏపీలో క్వారీలు, కాంట్రాక్టుల్లో ఎవరి ఆధిపత్యం నడుస్తుందో జగమెరిగిన సత్యమే. వైరి పక్షాలకు సంబంధించినవి ఏమైనా ఉంటే రూ.వందలకోట్ల జరిమానా నోటీసు వచ్చేస్తున్న విషయమూ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ క్వారీలు ఎవరి కంట్రోల్ లో ఉన్నాయి, అంత భారీ స్థాయిలో పేలుళ్లు ఎలా వచ్చాయి, అనుమతి ఉందా.. ఎన్ని జిలెటిన్ స్టిక్స్ వాడారు అనేది మాత్రం బయటకు రాలేదు. కనీసం ఆయా విభాగాలనుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. అయినా అమరావతిలో భూ కంపం అనే వార్త పతాకస్థాయిలో ప్రాచర్యంలోకి వచ్చింది.
ప్రకంపనలు వచ్చినప్పుడు వార్తలు ఇవ్వడం సహజమే. అయితే ఆ ప్రకంపనల స్థాయి ఏంటి, కారణం ఏంటనేది కూడా ఇవ్వడం, సంబంధింత యంత్రాంగ వివరణ ఇవ్వడమూ అవసరమే. అప్పుడే ప్రజల్లో భయాందోళనలు తొలుగుతాయి. అయితే నిన్నటి ప్రకంపనలకు సంబంధించి ఇవేవీ లేవు. పైగా అమరావతి ప్రాంతం నిర్మాణాలకు అనుకూలంగా కాదని నిపుణులు గతంలోనే చెప్పారని, ఇప్పుడు వారు చెప్పినట్టే భూ కంపం వచ్చిందనే వార్తలు ప్రచురితమైంది.
గత ఏడాది జనవరి 26న
కాగా వైసీపీ సొంత మీడియాలో గత ఏడాది జనవరి 26న ఓ వార్త వచ్చింది. ఆ వార్త ప్రకారం అమరావతి భూకంప జోన్‌లో ఉందని ఉస్మానియా విశ్వవిద్యాలయ జియోఫిజిక్స్ విభాగ రిటైర్డ్ అధిపతి రామదాస్ చెప్పినట్లు రాశారు. అమరావతి భూకంపాల తీవ్రత విషయంలో జోన్-3లో ఉందని, భవిష్యత్తులో అమరావతి ప్రాంతంలో వస్తే భూకంప లేఖినిపై తీవ్రత 6.5 శాతం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుందని చెప్పినట్టు రాశారు. అప్పట్లోనూ తెల్లవారు జామున కృష్ణ, గుంటూరు ప్రాంతాల్లో వచ్చిన ప్రకంపనల నేపథ్యంలో ఈ అభిప్రాయాన్ని ప్రచురించారు. భూకంప ప్రమాదాల విషయంలో అమరావతితో పోల్చుకుంటే విశాఖ చాలా సురక్షితం అని రామదాసుచెప్పినట్లు ఆ వార్తాసారాంశం. అంతేకాదు.. తాము అమరావతి ప్రాంతం భూకంపాల జోన్‌లో ఉందని గతంలోనే అప్పటి ప్రభుత్వానికి చెప్పినట్టు, అయినా అమరావతి నిర్మాణం ఎందుకు చేపట్టారో తెలియదని ఆయన వ్యాఖ్యానించినట్టు ఆ వార్త వచ్చింది. తాజాగా వచ్చిన ప్రకంపనల నేపథ్యంలో గతంలోనే నిపుణులుచెప్పారని, అదే నిజమైందని, అమరావతి ప్రాంతం నిర్మాణానికి ఆమోదయోగ్యం కాదని మరోసారి రుజువైందన్నట్లుగా వార్త ప్రచురితమైంది.
కాగా ఈ వార్తలపై అమరావతి జేఏసీ మండి పడింది. అమరావతిపై విష ప్రచారం జరుగుతోందని జేఏసీ కన్వీనర్ పువ్వాడ సుధాకర్ ఆరోపించారు. అమరావతిలో భూకంపం అని ప్రభుత్వ పెద్దలు విష ప్రచారం చేశారని, క్వారీలో పేళ్లు జరిగినా భూకంపం అని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
మరి 3వేల కోట్లు ఎందుకు..
ఇక్కడే మరో ప్రశ్న కూడా తలెత్తుతోంది. అమరావతి ప్రాంతంలో సగానికిపైగా పూర్తయిన భవనాల నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు రూ.3వేలకోట్ల అప్పు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అదే సమయంలో అమరావతిపై నెగెటీవ్ ప్రచారం కూడా జరుగుతోంది. గుంటూరు, విజయవాడ కార్పొరేషన్ల పరిధిలో ఎన్నికలున్నందున ఓటర్లను తప్పుదోవ పట్టించేందుకు వైసీపీ ఈ విధంగా వ్యవహరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. నిన్నటి భూ ప్రకంపనలను వైసీపీ సృష్టించిన భూకంపంగా నాయకులు విమర్శిస్తున్నా











