74వ మన్ కీ బాత్ కార్యక్రమంలో నీటి గురించి, ఆత్మనిర్భార్ గురించి అందరికి వివరించారు. ‘ఆత్మనిర్భార్ భారత్ ప్రతి ఇంటా పాటించాలి. ప్రతి నీటి చుక్కను ఆదా చేయడం మన బాధ్యత.. నీటి వినియోగం పట్ల అప్రమత్తంగా ఉండాలి. భవిష్యత్తు తరాల కోసం నీటిని వృధా చేయకుండా.. ఆదా చేయడం మన బాధ్యత అని ప్రధాని మోడీ వివరించారు. మరి కొన్ని రోజుల్లో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ వాన నీటిని ఒడిసిపట్టడం (క్యాచ్ ద రైన్) అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుందని మోడీ తెలిపారు.
Tune in. #MannKiBaat https://t.co/qQAT95UhTk
— Narendra Modi (@narendramodi) February 28, 2021
ఈ సందర్భంగా ప్రముఖ కవి సంత్ రవిదాస్ చెప్పిన మాటల్ని దేశ ప్రజలకు గుర్తు చేశారు. ‘ఏ పని చేసినా.. ఏం ఆశించకుండా చేయండి.. అది పూర్తయినపుడు ఎంతో సంతృప్తినిస్తుంది..’ అనే మాటలను గుర్తు చేసుకున్నారు. దేశ యువతలోని ప్రయోగాత్మక స్ఫూర్తిని మోడీ అభినందించారు. మార్చి 22న నీటి దినోత్సవాన్ని జరుపుకోబోతున్నామని గుర్తు చేశారు. ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా మోడీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో సైన్స్ అభివృద్ధి కోసం శాస్త్రవేత్త సీవీ రామన్ చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు మోడీ. ప్రపంచంలో అత్యంత పురాతనమైనదనిగా పేరుగాంచిన తమిళ భాషను నేర్చుకోలేనందుకు మోడీ విచారం వ్యక్తం చేశారు. తమిళ సాహిత్యం ఎంతో గొప్పదని పొగిడారు.