రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇంకా సెట్స్ పై ఉండగానే.. ప్రభాస్ రెండు సినిమాల్ని ఒకేసారి ట్రాక్ మీద పెట్టడం అందరికీ ఆశ్చర్యమనిపిస్తోంది. అందులో ఒకటి ఆదిపురుష్ అయితే.. మరొకటి సలార్ . ఈ రెండూ ఒకదానికొకటి సంబంధం లేని జోనర్స్. కానీ రెండూ పాన్ ఇండియా మూవీసే. భారీ తారగణంతో .. భారీ బడ్జెట్ తో నిర్మాణం అవుతోన్న సినిమాలే. అందులో సలార్ సినిమాకి సంబంధించి.. 10రోజుల షూటింగ్ ను ఇప్పటికే ప్రభాస్ కంప్లీట్ చేశాడు.
ఇక ఆదిపురుష్ వంతు వచ్చింది. వచ్చే వారమే ప్రభాస్ ఆదిపురుష్ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడని తెలుస్తోంది. ముంబైలో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్స్ లో ప్రభాస్ జాయిన్ అవుతాడు. శ్రీరామునిగా ప్రభాస్, సీతాదేవిగా కృతిసనన్ నటిస్తోన్నఈ మూవీలో రావణుడిగా బాలీవుడ్ హీరో సైఫ్ ఆలీఖాన్ ఇదివరకే ఫిక్సయిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా దాదాపు రూ. 500కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.