పంజాబ్లో వేడెక్కుతున్న రాజకీయం ..!
ఈ ఏడాది మార్చి నెలలో విడుతలు వారిగా జరగనున్న ఐదు రాష్ట్ర ఎన్నికల్లో పంజాబ్ స్టేట్ ఒకటి. ఇక్కడ ప్రధాన పార్టీలు లోకల్ పార్టీలతో ఇప్పటికే పొత్తులు పొడవగా.. తమదైన శైలిలో కాంగ్రెస్, బీజేపీ, ఆప్ లు ప్రజలకు ఉచిత హామీల జల్లులను కూరిపిస్తున్నాయి. మహిళలను టార్గెట్ చేసుకుని వరాలు జల్లులను కురిపిస్తున్నారు. కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దూ.. తాము అధికారంలోకి వస్తే.. గృహిణులకు నెలకు రూ. 2 వేలు ఇస్తామని, గృహ అవసరాలకు సంబంధించి 8 ఎల్పీజీ సిలిండర్లను ఉచితంగా అందించనున్నట్లు హామి ఇచ్చారు.
విద్యార్థులను ఆకట్లుకునే పథకాలతో కాంగ్రెస్ వ్యూహం..!
పంజాబ్ లో తిగిరి అధికారాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ తనదైన శైలిలో బీజేపీ, ఆప్ తో పోరాడుతోంది. మహిళలతోపాటు యువత, విద్యార్థులను సైతం ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే విద్యార్థులకు ఉచితంగా పథకాలను ప్రకటించింది కాంగ్రెస్. కాలేజ్ అడ్మిషన్ పొందిన వెంటనే బాలికలకు ద్విచక్ర వాహనాలు అందిస్తామని ప్రకటించింది. అలానే ఇంటర్ పాస్ అయిన విద్యార్థులకు రూ.20 వేలు,10 తరగతి పాస్ అయిన వారికి రూ.15 వేలు, 5వ తరగతి వారికి రూ.5 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇవన్నీ మహిళా సాధికారిత కోసం ఈ హామీలు ఇస్తున్నట్లు పంజాబ్ లోని బర్నాలా జిల్లాలో నిర్వహించిన ఓ ర్యాలీలో పాల్గొన్న సిద్దూ వెల్లడించారు. అయితే అంతకు ముందు తాము అధికారంలోకి వస్తే మహిళలకు నెలవారీ రూ.1000 ఇస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించడంతో తామే తక్కువ తిన్నామా.. అన్నట్లు సిద్దూ తనవంతు హామీలను గుప్పించారని పంజాబ్ పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పటికే ప్రచారం జోరందుకుంది!