పిచ్చొడి చేతిలో రాయి మాదిరిగా ఉద్యోగుల జీవితాలు!
ఉద్యోగుల జీవితాలు, జీవితాలు పిచ్చోడి చేతిలో రాయి మారిదిగా మారింది! రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు ట్రెజరీ ఉద్యోగుల మెడపై కత్తి మాదిరిగా దాపురించింది. మరోవైపు ఏపీ ట్రెజరీ ఉద్యోగులను ప్రభుత్వం టార్గెట్ చేస్తోంది. దీంతో ఒత్తిడితో కూడిన విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి వారికి దాపురించింది. ట్రెజరీ ఉద్యోగులు ఆదివారం కూడా పనిచేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయాల్లోనే ఉండి బిల్లులను క్లియర్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఏపీలో కార్యాలయాలన్నింటికీ వాట్సప్ మెసెజ్ లు వెళ్లాయి. ఇతర శాఖ నుంచి వచ్చిన బిల్లులనూ క్లియర్ చేయాలని ప్రభుత్వం పేర్కొంది. ఆదేశాలను ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని ట్రెజరీ శాఖ ఉన్నాతాధికారులు హెచ్చరించారు.
ప్రభుత్వ నిర్ణయం సరికాదు..
ప్రభుత్వం ఉద్యోగుల జీవితాలను జీతాలతో ముడిపెట్టి జగన్ రెడ్డి ఆడుకుంటున్నారని ఉద్యోగులు మండిపడుతున్నారు. కొత్త పీఆర్సీని ముక్త కంఠంతో 13 లక్షల మంది ఉద్యోగులు వ్యతిరేకిస్తుంటే.. కనీసం వారి ఆంకాంక్షలను ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండా పురుగులు కన్నా దారుణంగా చూస్తూ ఉద్యోగులను అడుగడుగునా అవమానిస్తున్నారు. రివైజ్డ్ పే స్కేల్ చెల్లింపులకు మార్చి 31 వరకు గడువును ఇస్తూ.. ఈ నెల 19న ప్రభుత్వం మెమో జారీ చేసింది. ఇదిలా ఉంటే శనివారం జనవరి నుంచే పీఆర్సీ ప్రకారం నూతన జీతాలు వేయాలంటూ ఉద్యోగుల మెడ మీద కత్తి పెట్టడం సబబు కాదని జేఏసీ నేతలు సూచిస్తున్నారు. ఒక వైపు సమయం ఉన్నా క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలంటూ ఈ రోజు మరో మెమో జారీ చేయడంపై ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.











