చర్చలతో సంతృప్తి అన్నది అవివేకం!
ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గడిచిన 45 రోజుల్లో 12 సార్లు ఉద్యోగులను చర్చలకు పిలిచారు. చర్చల పేరుతో సంతృప్తి పరచాలని యత్నించినా.. చేతల్లేని మాటల దౌత్యం వర్కౌంట్ కాలేదు! తీరా ఇస్తున్న ఐఆర్ కన్నా తక్కువ పీఆర్సీని ప్రకటించి, అర్థరాత్రి మరో మోసానికి తెరతీశారు. అంతేకాక ఉన్న హెచ్ఆర్ స్లాబ్ లను తగ్గించి.. వస్తున్న జీతాలకే ఎసరుపెట్టారు. ఏదో ఉద్యోగుల కొంపలు మునిగుతున్నాయని అర్థరాత్రి చీకటి జీవోలు విడుదల చేసి ఉద్యోగులు వెన్ను విరిచే ప్రయత్నం చేశారు. నమ్మించి చేసిన మోసాన్ని ఒక్కసారి రివైండ్ చేసుకుని, బుద్ధి చెప్పాలని ఉద్యమం వైపు ఉద్యోగులు అడుగులు వేశారు. ఉద్యోగ హక్కులను సాధించుకునేందుకు నిరసిస్తుంటే అదేదో ద్రోహంలా జగన్ రెడ్డి ప్రభుత్వం భావిస్తుంది. చేస్తున్న ఆందోళనలను అణివేయడానికి అనేక దారులను వెతుకుతున్నారు. నిరసనలు తెలుపుతున్న ఉద్యోగులను గడిచిన నాలుగు రోజులుగా మూడు సార్లు మంత్రులు చర్చలకు రావాలని కోరుతున్నప్పటికీ.. ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు నిరాకరించారు. 12 సార్లు చర్చలకు పిల్చి అవమానించింది చాలు.. ప్రభుత్వం జారీ చేసిన చీకటి జీవోలను రద్దు చేసే వరకు చర్చల్లేవని చెబుతున్నా.. బెదిరించి మరి కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ఇస్తాం.. తీసుకొండి అంటూ ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇటువంటి నియంతృత్వం పొకడలను ప్రజలు, ప్రజ సంఘాలు, రాజకీయ పార్టీలు గమనిస్తునే ఉన్నారు.
ఎస్మా అస్త్రంతో విచ్ఛిన్నం సాధ్యమేనా?
కొత్తపీఆర్సీ అమలును వ్యతిరేకిస్తూ.. పీఆర్సీ సాధనకు జేఏసీ నేతలు స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ నెల 24న ప్రభుత్వానికి పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ సభ్యులు సమ్మె నోటీసు ఇచ్చారు. 14 రోజుల్లో తమ సమస్యలను, డిమాండ్ లను నెరవేర్చకుంటే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. దీంతో రాష్ట్రంలోని పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఏపీలో ప్రస్తుతం విపక్షాలకు, మీడియా, సోషల్ మీడియాలకు ఇదే చర్చను రగిలించారు. ఎవరి నోట వెంటైనా ఉద్యోగుల చేస్తున్న నిరసన కామెంట్సే! మీడియా అటెన్షన్ ను పూర్తిగా డైవర్ట్ చేసింది. ‘‘ ఓటీఎస్ పేరుతో ప్రభుత్వ సాగిస్తున్న అఫిషియల్ వసూళ్లు, అదానీకి ధారదత్తమౌతున్న పోర్టులు, అచేతనంగా పడివున్న అభివృద్ధిని, ఆగి కళ తప్పిన సాగు, తాగు నీటి ప్రాజెక్టులు, పోలవరం పనులు, నిర్వాసితుల వెతలు, సచివాలయం ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్, తెస్తున్న అప్పులు, చేస్తున్న అవినీతి‘‘ ఇలాంటి సవాలక్ష సవాళ్లును జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని వెంటాడుతున్నాయి. అటువంటి ఇష్యూస్ అన్నింటిని ఫోకస్ చేయకుండా ఉద్యోగులు సమస్యలు, జిల్లాల పునర్విభజనపై చర్చించే టాపిక్ ను రాజకీయంగా డైవర్ట్ చేశారు. ప్రస్తుతం ఉద్యోగులు చేస్తున్న ఉద్యమాన్ని కనీసం పరిగణలోకి తీసుకోకుండా జగన్ చివరి అస్త్రంగా వారిపై ఎస్మా( ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ ) ను ప్రయోగించనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 7 నుంచి పూర్తిస్థాయిలో సమ్మె దిగుతున్నట్లు ఇప్పటికే జేఏసీ నేతలు ప్రభుత్వానికి నోటీసు అందించాయి. ఉద్యోగ సంఘాలు చేస్తున్న ఉద్యమానికి వైద్యారోగ్యశాఖ ఉద్యోగులు, ఆర్టీసీ కార్మిక సంఘాలు, విద్యుత్ ఉద్యోగులు మద్దతు తెలిపారు. అలానే తెలుగుదేశం, బీజేపీ, జనసేన, సీపీఐ, సీపీఎం పార్టీలు ఉద్యోగులు చేస్తున్న నిరసనలకు మద్దతును తెలిపారు. కాగా, ఉద్యోగులపై ఉద్యోగులపై ప్రభుత్వం ఎస్మా ప్రయోగించేందుకు ప్రయత్నిస్తోందని సోషల్ మీడియాలో వార్తలు ప్రస్తుతం ఊపందుకున్నాయి. 1981 లో రూపొందించిన ఈ చట్టం ప్రభుత్వం అప్పుడప్పుడు ఉద్యోగులపై ప్రయోగిస్తామని హెచ్చరిస్తుంటాయి. ఈ చట్టం ప్రకారం సమ్మెను నిషేధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయితే ప్రభుత్వం రంగాల్లో అత్యవసర సేవలలో విధులు నిర్వర్తించే ఉద్యోగులందరూ సమ్మె చేయడం చట్టవిరుద్దం అవుతుంది. ప్రస్తుతం జగన్ చేతుల్లో ఉన్న చివరి అస్త్రం కూడా ఇదే! అలా ఎస్మా ప్రయోగించిన తరువాత ఉద్యోగులు సమ్మెను ఇంకా ఉద్ధృతం చేస్తే.. చివరికి ఆ సమ్మె సకల జనుల సమ్మెగా మారి జగన్ రెడ్డి ప్రభుత్వం పరిస్థితిని ఇంకా దారుణంగా దిగజారుతోంది!! అనాలోచితంగా, ఎటువంటి అభిప్రాయాలు సేకరించకుండా, బలవంతంగా రుద్దాలని తీసుకొచ్చిన చీకటి జీవోలకు బాధ్యత వహిస్తూ.. తక్షణమే రద్దు చేయాలని సర్వత్ర డిమాండ్ వినిపిస్తున్నాయి!











