బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్య కేసు రోజుకొక మలుపు తిరుగుతోంది. ఇప్పటికే రంగంలోకి దిగిన సీబీఐ అనుమానితులను విచారణ చేస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ కేంద్ర మంత్రి సుబ్రమణియన్ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. విష ప్రయోగం వల్లే సుశాంత్ చనిపోయారని వ్యాఖ్యలు చేశారు. చనిపోయిన వెంటనే పోస్ట్‌మార్టం జరిగి ఉంటే అసలు విషయం వెలుగులోకి వచ్చేదని కావాలనే ఆలస్యం చేశారని విమర్శలు చేశారు. ఇలాంటి కుట్రకు పాల్పడ్డ వారి మనస్తత్వం, వారి ఉద్దేశం విచారణలో బయట పడుతుందని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
సుశాంత్ స్నేహితుడు సందీప్ సింగ్ పై ఆయన సందేహాన్ని వ్యక్తం చేశాడు. సందీప్ సింగ్ పలుమార్లు దుబాయ్ ఎందుకు వెళ్ళాడో విచారించాలని ఆయన కోరారు. ఈ కేసులో పలు సంచలన విషయాలు బయటికి రానున్నాయని ఆయన అభిప్రాయపడ్డాడు. ప్రముఖ డ్రగ్స్ డీలర్ అయాశ్ ఖాన్ ఆత్మహత్య జరిగిన రోజున సుశాంత్ కలిసినట్లు సమాచారం తనవద్ద ఉందని ఆయన పెద్ద బాంబు పేల్చాడు. జూన్ 14న సుశాంత్ ముంబైలోని తన ప్లాట్ లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసును విచారించిన పోలీసులు ఆత్యహత్యగా నిర్దారించారు. కానీ సుశాంత్ ది ఆత్మహత్య కాదు హత్య అంటూ మొదటి నుంచి సుబ్రమణియన్ స్వామి తన వాదనను వినిపిస్తున్నారు.
ముంబై పోలీసులు సరైన విచారణ జరపడం లేదని అనుమానం వ్యక్తం చేసిన ఆయన స్వతంత్ర సంస్థతో విచారణ జరపాలంటూ డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా సీబీఐకి కేసు అప్పగించాలని డిమాండ్లు రావడంతో బాటు బీహార్ ప్రభుత్వం కూడా సీబీఐతో విచారణ జరపాలని సిఫార్సు చేయడంతో కేంద్రం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. తాజాగా సర్వోన్నత న్యాయస్థానం కూడా సీబీఐ విచారణకు ఆదేశించింది. ఇప్పటికే సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఫిర్యాదు మేరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా రంగంలోకి దిగింది. ఈ కేసును లోతుగా విచారించి బాద్యులను పట్టుకోవాలని సుశాంత్ అభిమానులు కోరుకుంటున్నారు.











