పతనమౌతున్న అధికార వైసీపీ.. అధినేతే ఆ పార్టీకి మైనస్..!!
ప్రజారంజక పాలన అందిస్తానన్న జగన్ రెడ్డి.. ప్రజా కంఠక పాలనకు శ్రీకారం చుట్టారు. అడ్డుగోలు అవినీతితో సహజ వనరులను దోచుకున్నారు. అడ్డుచెప్పిన వారిని, ప్రశ్నించిన మీడియా గొంతునొక్కి రాక్షస పాలన అంటే ఇదేనని చూపారు. లక్షల కోట్ల అప్పులు చేసి సంక్షేమంలో కుమ్మరిస్తే.. అడ్డుగోలుగా దోచుకున్న పట్టించుకోరులే అని ప్లాన్ వేశాడు. అది బెడిసికొట్టి.. ఏపి ప్రజలు జగన్ పాలన విరుగుడుకు విముక్తి సిద్ధాంతం వైపు అడుగులు వేస్తున్నారు. జగన్ రెడ్డి అవివేక చర్యలు కారణంగా ఏపీలోని అన్ని సెక్టార్స్ ఘోరంగా దెబ్బతిన్నాయి. అవి కోలుకునేందుకు ఎన్నేళ్లు పడుతాయో తెలియని పరిస్థితి అని మీడియా, సోషల్ మీడియా మొత్తుకుంటునే మీడియాకోక పేరుపెట్టి.. తప్పుపడుతూ వస్తున్నారు. చివరికి తన పతనాన్ని తానే గొయ్యి తీసుకున్నారు. బలమైన పార్టీ గా ఏపీ అవతరించిన వైసీపీకి అంతిమంగా అధినేత జగన్ చర్యలు, ఆలోచనలే ఆ పార్టీకి మైనస్ అని గట్టి ఆధారాలతోకూడిన వాదనలు లేకపోలేదు!
రాజాధాని మాస్టర్ ప్లాన్ ను విచ్ఛినం చేయడానికి సర్కార్ వ్యూహం..!
అమరావతిని విచ్ఛిన్నం చేసి.. వికృత చేష్టాలకు కేరాఫ్ గా మూడు రాజధానులను తీసుకొచ్చారు. అది బెడిసికొట్టి ఆ బిల్లును వెనక్కి తీసుకున్నారు. ఈక్రమంలోనే సీఆర్డీఏ బిల్లును కూడా వెనక్కి తీసుకున్నారు. ఇదిలా ఉంటే అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్ ను విచ్ఛిన్నం చేయడానికి మాస్టర్ స్కేచ్ వేశారు. తుళ్లూరు, మంగళగిరి మండలాల్లోని 19 గ్రామాలతో అమరావతి క్యాపిటల్ సిటీ మున్సిపల్ కార్పోరేషన్ ఏర్పాటుకు అడుగులు వేస్తోంది జగన్ సర్కార్! దీనిని రాజధాని రైతులు తప్పుబడుతున్నారు. బుధవారం అమరావతి క్యాపిటర్ సిటీ ఏర్పాటుకు అధికారులు ప్రజాభిప్రాయం తీసుకునేందుకు సిద్ధమయ్యారు. మంగళగిరి మండలం కుర్రగల్లు పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభ ఏర్పాటు చేసి అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ సభలో ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకించారు. రైతుల న్యాయం చేయకుండా రాజధాని జోలికొస్తే ఊరుకునేది లేదని సభకు హాజరైన వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికులు, రైతులు కార్పోరేషర్ ప్రతిపాదనను ఏకగ్రీవంగా వ్యతిరేకించారు. కురగల్లు సభలో ప్రజలు నుంచి వ్యతిరేకత రావడంతో ఆ తరువాత అధికారులు నీరుకొండలో ప్రజాభిప్రాయం తీసుకున్నారు. అక్కడా దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో అక్కడ నుంచి కూడా అధికారులు వెనుదిరిగారు.











