ఈ నెల అక్టోబర్ 15 నుంచి కేంద్ర ప్రభుత్వం థియేటర్స్ తెరుచుకోడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 50శాతం ఆక్యుపెన్సీతో.. కోవిడ్ నిబంధనలు పక్కగా పాటించేలా మార్గదర్శకాలు రూపొందించింది. ఆ ప్రకారమే నిన్న ఆంధ్రలో థియేటర్స్ తెరిచారు. కానీ ఇద్దరు ముగ్గురు ప్రేక్షకులు మాత్రమే దర్శనమిచ్చి.. డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్స్ ఓనర్స్ కు పెద్ద షాకిచ్చారు. కరోనాకి భయపడి.. ఒక్కరు కూడా థియేటర్స్ కేసి కన్నెత్తి చూడలేదని రిపోర్ట్స్ వస్తున్నాయి.
థియేటర్స్ లో తోలుకోవడానికి ఈగలు కూడా లేవని వాపోతున్నారు యజమానులు. ఇప్పటికే వైజాగ్ ఐనాక్స్ తెరిస్తే ఒక రోజు కలెక్షన్ సుమారు 1500 అని రిపోర్ట్స్ వచ్చాయి. జనాల్లో భయాందోళనలు ఇంకా తగ్గలేదు అనడానికి ఇది నిదర్శనం . చాలా థియేటర్లలో వసూళ్లు ఒక్కో ప్రదర్శనకు 1000 రూపాయల కన్నా తక్కువ. మల్టీప్లెక్సులు ఉన్న మాల్స్ కూడా ప్రేక్షకుల్లేక వెలవెల్లాడాయి.
ఇక వైజాగ్ వరుణ్ ఐనాక్స్ స్క్రీన్ 6 లో `భీష్మ` సినిమా వేస్తే.. నలుగురు ప్రేక్షకులు వచ్చారట. సుమారు 632 రూపాయల ఆదాయం అది.. సాధారణంగా అత్యంత రద్దీగా ఉండే ఫస్ట్ షో ప్రదర్శనకు కేవలం ఆరుగురు ప్రేక్షకులు వచ్చారని తలకొట్టుకుంటున్నారు థియేటర్ యజమానులు. దానికి కేవలం 948 రూపాయల ఆదాయాన్ని మాత్రమే పొందారు. భీష్మ మొత్తం ఆదాయం వరుణ్ ఐనాక్స్ కి మొత్తం నెట్ రూ .1239 అని తెలిసింది. ప్రేక్షకుల నుంచి ఇంత ఘోరమైన స్పందన పట్ల ఖంగుతిన్నారు డిస్ట్రిబ్యూటర్స్. కనీసం నిర్వహణ ఖర్చులు … విద్యుత్ బిల్లులు అయినా కష్టమే. ఇదే ధోరణి కొనసాగితే ఎక్కువ నష్టాలు ఎదుర్కోవలసి వస్తుందని ఎగ్జిబిటర్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.











