అసలే తెలుగు రాష్ట్రాలలో కష్టాలకు ఎదురీదుతున్న కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలించి. కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వంతో పాటు పార్టీ పదవులకు రాజీనీమా చేశారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డికి పంపారు. ప్రస్తుతం శ్రీశైలం గౌడ్ మేడ్చల్ డీసీసీ అధ్యక్షునిగా ఉన్నారు.
గత కొంత కాలంగా కాంగ్రెస్ వ్యవహారాలపై అసంతృప్తిగా ఉన్న శ్రీశైలం గౌడ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. బీజేపీలో చేరే అంశంపై బీజేపీ పెద్దలతో చర్చించడానికి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు కూన శ్రీశైలం గౌడ్. అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని తెలిపారు. బలమైన ప్రతిపక్షంగా వ్యవహరించడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని వ్యాఖ్యానించారు.