ప్రసాదరావు కొన్నాళ్లుగా అమెరికాలో ఉంటున్నారు. నిన్న రాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ ప్రసాదరావు మృతిచెందారు. ఆయన మరణం పట్ల పలువురు ప్రముఖులు, అధికారులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 1979వ బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఆయన తెలంగాణ ప్రాంతంలోని కరీంనగర్, నల్లగొండ, నిజామాబాద్ ఎస్పీగా పనిచేశారు. అనంతరం ఏసీబీ డీజీగా, విశాఖ ఎస్పీ, హైదరాబాద్ కమిషనర్‌గా, ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగానూ సేవలందించారు. ఆయన సేవలకుగాను 1997లో భారత పోలీస్ పతకం, 2006లో రాష్ట్రపతి పోలీసు పతకాలను అందుకున్నారు. డీజీపీ వి.దినేశ్ రెడ్డి తర్వాత 30 సెప్టెంబరు 2013లో ఇన్‌చార్జ్ డీజీపీగా ఆయన వ్యవహరించారు.
జగన్ తప్పు చేశాడా..? చిన జీయర్ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై తిరుగుబాటు జెండా ఎగరవేశారు త్రిదండి చినజీయర్...











