ప్రముఖ టీవీ ఛానల్స్ అన్నీ ఇప్పుడు సినీ సెలబ్రిటీస్ హోస్టింగ్ తో హోరెత్తిపోతున్నాయి. తాజాగా సమంతా సామ్ జామ్ అంటూ.. జామ్ జామ్ మని ఆహాలో ఓ టాక్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ లిస్ట్ లో మరో బ్యూటీ కూడా చేరబోతోంది. కాకపోతే.. ఆమె మాజీ హీరోయిన్ లెండి. ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోలందరి సరసన ఓ రేంజ్ లో రొమాన్స్ పండించిన బ్యూటీ సమీరా రెడ్డి ఇప్పుడు ఓ బాలీవుడ్ టాక్ షో కోసం హెస్ట్ అవ తారమెత్తబోతున్నట్టు సమాచారం.
టాలీవుడ్, కోలీవుడ్ లో అగ్ర కథానాయకులందరి సరసన ఆడిపాడిన సమీరారెడ్డి.. కథానాయికగా అంతగా క్లిక్ కాలేకపోయింది. దాంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. పెళ్ళి చేసుకొని సెటిల్ అయిపోయింది. ఇప్పుడు ఆమెకు ఇద్దరు పిల్లలు. ఆ మధ్య సమీరా రెడ్డి విక్రమ్ ఆర్య హీరోలుగా నటిస్తోన్న బాలా చిత్రం ఎనిమీ లో విలన్ గా నటిస్తోందని వార్తలొచ్చాయి. కానీ ఆ వార్తల్ని ఆమె ఖండించి తాను నటించడం లేదంటూ.. క్లారిటీ ఇచ్చిందనుకోండి. అయితే ఇప్పుడు సమీరా ఓ హిందీ ఛానల్ కోసం హోస్ట్ గా మారబోతోందంటూ.. టాక్ వినిపిస్తోంది. అయితే ఆమె హోస్టింగ్ చేయబోతోంది ఎలాంటి షో అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. మరి సమీరారెడ్డి హోస్టింగ్ ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.











