శిలాఫలకంపై అశోక్ గజపతిరాజు పేరులేకపోవడమే శోచనీయం!
విజయనగరం జిల్లా రామతీర్థంలో కోదండ రామాలయం శంకుస్థాపనకు ముహుర్తాన్ని జగన్ రెడ్డి ప్రభుత్వం ఫిక్స్ చేసింది. శంకుస్థాపన ప్రాంతంలో ప్రోటోకాల్స్ కు నీళ్లొదిలింది. కనీసం ఆలయానికి అనువంశిక ధర్మకర్తగా ఉన్న అశోక్ గజపతి పేరు కూడా శిలాఫలకంపై పెట్టలేదు. దీనిపై గజపతి రాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శిలఫలకం ఏర్పాటు చేస్తుండగా గజపతి వర్గీయులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వైసీపీ, గజపతి రాజు వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. తీవ్ర ఉద్రిక్తతలు మధ్యనే స్వామివారిని దర్శించుకుని అశోక్ గజపతిరాజు అక్కడు నుంచి నిష్క్రమించాడు. కోదండ రామాలయం తన ప్రమేయం లేకుండా రాష్ట్రమంత్రులు శంకుస్థాపన చేయడం, శిలాఫలకంపై ప్రోటోకాల్ ప్రకారం పేరు ముద్రించపోవడాన్ని అశోక్ గజపతిరాజు తప్పుపట్టారు. ఈ విషయం తీవ్ర విస్మయానికి గురిచేస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. దేవాలయ నిర్మాణ కార్యక్రమాలన్నీ అనాదిగా రాజవంశీయులైన పూసపాటివారే చేసేవారు. అటువంటి జగన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సంప్రదాయాలను మంటకల్పుతూ రామతీర్థం నిర్మాణానికి శంకు స్థాపన క్రతువును చేపట్టారని విజయనగరం వాసులు మండిపడుతున్నారు.
విరాళం ఇచ్చినా .. తిప్పి పంపారు ..!
కోదండ రాముని ఆలయం నిర్మాణానికి అనువంశ ధర్మకర్తగా ఉన్న మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు మొదటి నుంచి ఆలయంలోని పలు కార్యక్రమాలను చూసేవారు. అయితే గత ఏడాది డిసెంబర్ 28న రాముని విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఏడాది తరువాత రాష్ట్ర ప్రభుత్వం నూతన విగ్రహ ప్రతిష్ట, ఆలయ పునర్నిర్మాణ కార్యక్రం చేపట్టింది. అయితే బుధవారం చేపట్టి ఆలయ క్రతువుకు ఆయల ధర్మకర్తగా విరాళంగా పంపించిన చెక్ ను దేవాదాయ శాఖ అధికారులు తిరిగి వెనక్కు పంపించారు. కార్యక్రమంలో పెద్దలని గౌరవం లేకుండా ప్రోటోకాల్ అస్సలు పాటించలేదు. కనీసం శిలఫలకంలో గజపతిరాజు పేరు పెట్టకపోవడంతో ఆయన వర్గీయులు ఆవేశంతో ఊగిపోయారు. ప్రోటోకాల్ ప్రకారం పేరుపెడితే.. ఎక్కడపెట్టారో చూపాలని గజపతి రాజు వర్గీయులు పట్టుపడుతున్నారు. జగన్ రెడ్డికి హిందూధర్మంపై, సనాతన ఆచారాలపై ఉన్న విలువలు తెలియవని బీజేపీ, తెలుగు దేశం పార్టీ నేతలు దుమ్మెత్తిపోశారు. మంత్రి వెల్లంపల్లి, బొత్స తీరును సోషల్ మీడియా నెటిజన్లు ఎండకడుతున్నారు.











