నోటికే కాకుండా చేతలకూడా పని చెప్పండి .. కేడర్ నిలబడుతోంది!
‘అది నోరా .. దాటిమట్టా’ అంటారు. ఈ సామెత ఎమ్మెల్యే రోజాకు సరిగ్గా సరిపోతోంది! నోటికి ఎంత మాటొస్తే .. అంత మాట అనెయ్యండం ..! మాటల తూటాలను సొంతపార్టీ వాళ్లని కూడా చూడకుండా వాడటం .. హర్ట్ చెయ్యడం రోజాకు పరిపారిటే!! అందుకే సొంత పార్టీవాళ్లే నేడు రోజా పరువును బజారుకీడుస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని నిండ్ర, విజయపురం, పుత్తూరు, వడమాలపేట మండల్లోని ద్వితీయ శ్రేణి నాయకులందరూ.. ఒన్ సైడ్ గా వచ్చి .. రోజా ఆగడాలను, అకృత్యాలను బయటికక్కుతున్నారు. సిగ్గుదీసి నగరి నడివీథిలో నిల్చొపెడుతున్నారు. మంగళవారం జగన్మోహన్ రెడ్డి జన్మదినం సాక్షిగా నియోజకవర్గంలోని పుత్తూరులో రాజుకున్న ఫ్లెక్సీ రాజకీయం కేడర్ గుండెల్లో ఆరని మంటలను రాజేసింది!
కేడర్, ప్రజలు ఇద్దరు ముఖ్యమే ..!
‘కొత్త నీరొచ్చి .. పాతనీరును తీసుకుపోయి’ అన్న చందగా కాకుండా పార్టీలో కొత్తవారికి ప్రయారిటీ, పాతవారికి సముచిత స్థానం కల్పించకుంటే అంతే ..! పరువు రోడ్డుకీడుస్తారుగా!! అదే రోజాకు జరిగింది. పార్టీని నమ్ముకుని గత దశాబ్ధకాలంగా తృతీయ శ్రేణి నాయకులను, కార్యకర్తలను ముందుకు నడిపిస్తూ వస్తున్న ద్వితీయ శ్రేణి నాయకులదే నియోజకవర్గంలో పైచేయి! వీరి ఇన్ ఫుట్స్ తీసుకొనే ఎమ్మెల్యే పూర్తిగా ముందుకు పోవాల్సి ఉంటుంది. వీరులేనిది ఎమ్మెల్యేకు అడుగు ముందుకు పడదని గమనించుకుంటే.. వారితో పెట్టుకోరు! నిండ్ర మండలంలో కేజే కుమార్, చక్రపాణిరెడ్డి, విజయపురం లక్ష్మీపతిరాజు, పుత్తూరులో అమ్ములు, వడమాలపేటలో మురళీరెడ్డిలు నియోజకవర్గంలో బలమైన నాయకులు. నాయకుడి గెలుపునకు డిసైడ్ ఫ్యాక్టర్స్ కూడా వీళ్లే! అటువంటి ద్వితీయ శ్రేణి నాయకుల మనోభావాలపైనే రోజా దెబ్బకొట్టింది అన్నది ఆరోపణలు. మరి వాళ్లెందుకు ఊరుకుంటారు! రోజా పై రివర్స్ గేర్ వేశారు. రోజా చేస్తున్న ప్రతి అంశాన్ని ఎండగట్టేదందకు కంకణం కట్టుకున్నారు. మంగళవారం నగరి నియోజకవర్గలో జరిగిన జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో సీఎంకు విసెష్ చెప్పడం మాని .. ఎమ్మెల్యే ఆర్కే రోజా పై విమర్శలు గుప్పించేందుకే సమయం కేటాయించారు. అకృత్యాలు ఎండగట్టి.. అక్రమాల చిట్టి బయటపెట్టే ప్రసంగాలకే అధిక ప్రాధాన్యతనిచ్చారు.రోజాతో నెలకొన్న వివాదం ముఖ్యమంత్రితోనే తేల్చుకుంటామని నాయకులు తేగసిచెప్పటడం వంటి కామెంట్స్ రాయలసీమలో హీట్ రాజేస్తున్నాయి.