దూకుడుకు కేరాఫ్ అడ్రెస్ గా చెప్పుకునే టీం ఇండియా మాజీ సారధి , బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ కొత్త అవతారంలో దర్శనమిచ్చారు.50 వ వాసంతవలో అడుగుపెట్టిన దాదా తన బర్త్ డే సెలబ్రేషన్స్ ను లండన్ లో ఘనంగా జరుపుకున్నారు. గంగూలీ జన్మదిన వేడుకల్లో సచిన్ , జైషా లతో పాటు పలువురు ప్రముఖులు , ఆయన స్నేహితులు పాల్గొన్నారు. కాగా గంగూలీ పుట్టినరోజు సందర్భంగా గంగూలీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన అభిమానులు, తాజా, మాజీ క్రికెటర్ల శుభాకాంక్షల పోస్టులతో సోషల్ మీడియా హోరెత్తిపోగా, దాదా కు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
తన పుట్టిన రోజు సంధర్భంగా సౌరవ్ లండన్ వీధుల్లో కొత్త అవతారంలో దర్శనమిచ్చాడు. బాలీవుడ్ పాటలకు డ్యాన్స్ చేస్తూ ఉత్సాహంగా కనిపించాడు. అతడి చుట్టూ ఉన్న వారు కూడా సంతోషంగా చిందులు వేస్తూ కనిపించారు. గంగూలీ కుమార్తె సనా గంగూలీ, భార్య డోనా కూడా ఆయనతో పాటు ఆ పాటలకు స్టెప్పులు వేసి అలరించారు. ఈ స్వీట్ మూమెంట్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇక గంగూలీ బర్త్ డే సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు విశేషంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానంగా ఒకప్ప ఆయన టీం మేట్ అయిన యువరాజ్ ట్విటర్ వేదికగా దాదాకు విషెస్ తెలియయజేశాడు. ‘హ్యాపీ బర్త్ డే దాదా. నువ్వో గొప్ప స్నేహితుడివి. నువ్వో ప్రభావవంతమైన కెప్టెన్‌వి. సీనియర్ కానీ, జూనియర్ కానీ ఎవరైనా సరే నీ నుంచి నేర్చుకోవాలని అనుకుంటారు. ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలి. ప్రేమ పూర్వక శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశాడు.