ఎటూ చూసినా పచ్చని అడవులు.. కనుచూపు మేరలో గోదావరి జలాలు.. ఎత్తైన కొండలు, గుట్టలు.. వాటి మధ్య బోటింగ్ అంటే.. ఎవరైనా ఎగిరి గంతేస్తారు. మరి ఇలాంటి అందమైన లొకేషన్ కు వెళ్లాలంటే ఏ గోవానో, ఏ మల్దీవులకో వెళ్లాల్సిన అవసరం లేదు. మనదగ్గరే చూసేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యంగా మీరు కూడా బోట్ టూర్ కు రెడీకండి. తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న చక్కని టూరిజం స్పాట్ పాపికొండలు. అటు తెలంగాణకు, ఇటు ఆంధ్రప్రదేశ్ కు మధ్యలో ఉన్న పాపికొండల యాత్రకు వచ్చేందుకు టూరిస్టులు ఆసక్తి చూపుతుంటారు. పాపికొండల అందాలను తిలకించేందుకు విదేశీయులు వస్తారంటే.. అంతలా మైమరిపించేలా చేస్తోందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
21 నెలల తర్వాత
తెలుగు రాష్ట్రాల్లో పాపికొండల యాత్ర చాలా ఫేమస్. నేచర్ ను ఇష్టపడేవాళ్లు ఒక్కసారైనా పాపికొండలను చూడాలనుకుంటారు. అందుకే అన్ని కాలాల్లోనూ ఇక్కడ బొటింగ్ సౌకర్యం ఉంటుంది. అయితే కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదం వల్ల ఏడాదిన్నరపాటు పాపికొండల యాత్ర నిలిచిపోయింది. దీంతో ఎంతోమంది పర్యాటకులు.. ఈ యాత్రకు దూరమయ్యారు. ప్రభుత్వం మళ్లీ ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నా.. ముందుకు సాగలేదు. దాదాపు 21 నెలల తర్వాత మళ్లీ బోటింగ్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు అన్నిరకాల భద్రతా చర్యల మధ్య విహారయాత్ర మొదలైంది. ప్రస్తుతం ఆరు పడవలు నడుస్తున్నాయి. త్వరలోనే మరిన్ని బోట్లు అందుబాటులోకి రానున్నాయి.
ఏయేం చూడొచ్చు…?
పాపికొండల యాత్రలో గోదావరి నది అందాలతో పాటు పట్టిసీమ, పోలవరం, గండిపోచమ్మ ఆలయం, భద్రాచలం, మారేడుమిల్లి, దేవీపట్నం వంటి పర్యాటక ప్రాంతాలు దర్శనమిస్తాయి. పాపికొండల యాత్రలో గోదావరి నది అందాలతో పాటు పట్టిసీమ, పోలవరం, గండిపోచమ్మ ఆలయం, భద్రాచలం, మారేడుమిల్లి, దేవీపట్నం వంటి పర్యాటక ప్రాంతాలు దర్శనమిస్తాయి.
మళ్లీ ప్రారంభం
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం పరిధిలో పాపికొండల విహారయాత్ర గురువారం పునఃప్రారంభమైంది. ఏపీ పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాపికొండలు యాత్ర చేశారు. గతంలో జరిగిన విషాద సంఘటనలు వంటివి జరగకకుండా భద్రతా చర్యలు తీసుకున్నారు. పర్యాటకుల కోసం ప్యాకేజీలనూ అందుబాటులోకి తెచ్చారు.
Must Read ;- గోదావరి @ 15 : సున్నితమైన భావోద్వేగాల లాంచీ ప్రయాణం