తెలుగు రాష్ట్రాల సీఎం లు కేసీఆర్, జగన్.. ఒకరినొకరు గౌరవించుకునేవారు. పలు సమస్యలు, కీలక అంశాలపై భేటీ అయ్యేవారు. రెండు రాష్ట్రాల మధ్య ఏ చిన్న సమస్య తలెత్తినా.. పరస్పరం చర్చించుకొని నిర్ణయాలు తీసుకునేవారు. అలాంటివాళ్లు సడన్ గా రివర్స్ గేర్ లోకి మారిపోయారు. కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఇటీవల జరుగుతున్న పరిణామాలే అందుకు కారణం. కరోనా నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ, ఆంధ్రా సరిహద్దులో ఆంక్షలు విధించారు. అంబులెన్స్ లను సైతం నిలిపివేశారు. ఈపాస్ ఉంటేనే తెలంగాణలోకి అడుగుపెట్టేలా కఠిన నిబంధనలను అమలు చేశారు. చివరకు హైకోర్టు జోక్యం చేసుకోవడంతో కొంత వరకు సమస్య సద్దుమణిగింది. అయితే ఈ వ్యవహరం మాత్రం ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడేలా చేసిందంటున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు.
జలదోపిడీపై కేసీఆర్ సీరియస్
అంతరాష్ట్రాల మధ్య ఏ చిన్న సమస్య వచ్చినా ఇద్దరు సీఎంలు (జగన్, కేసీఆర్) పరిష్కరించుకునేవాళ్లు. కేంద్రం జోక్యం లేకుండా సొంత నిర్ణయాలు తీసుకునేవాళ్లు. జల వ్యవహరంలో ఏమైందో గానీ జగన్ పై కేసీఆర్ గుర్రుమంటున్నారు. సీఎం జగన్ మూర్ఖుడిలా వ్యవహరిస్తున్నారని, మూర్ఖత్వంలో ఆయన తన తండ్రి రాజశేఖర్ రెడ్డిని మించిపోయాడని మండిపడ్డారు. కృష్ణా బేసిన్ లో ఏపీ సర్కార్ అక్రమ ప్రాజెక్టులు చేపడుతుందని కేసీఆర్ సీరియఎస్ అయ్యారు. దీనిపై తాడోపేడో తేల్చుకోవాలని నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో తీర్మానించేశారు. తెలంగాణ రైతాంగ ప్రయోజనాల కోసం ఎంతవరకైనా పోరాడాలని, ఈ విషయంలో ఏపీ జలదోపిడీని అరికట్టాలని నిర్ణయించుకున్నారు. జగన్ కు చట్టాలపై ఏమాత్రం అవగాహన లేదని, మౌనంగా ఉంటే మరిన్ని కుట్రలు చేస్తాడని కేసీఆర్ ఆరోపించారు.
అవసరమైతే ఢిల్లీలో ధర్నాలు
కేంద్రం ఆదేశించినా జగన్ ఆక్రమ ప్రాజెక్టులు ఆపడం లేదని, ఈ విషయమై సీఎం కేసీఆర్ ఢిల్లీలో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అవసరమైతే ఢిల్లీలో ధర్నాలు, ఆందోళన చేయడానికైనా సిద్ధంగా ఉండాలని టీఆర్ఎస్ ఎంపీలకు సంకేతాలు ఇస్తున్నారు. మరోవైపు ఏపీకి పోటీగా తెలంగాణలోనూ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని కేసీఆర్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. వాస్తవాల ప్రతిపాదికన ముందుకు వెళ్లాలని, జలదోపిడీపై ఏపీ తగ్గకపోతే ప్రధాని నరేంద్ర మోడీ, జలమంత్రికి వినతిపత్రాలు సమర్పించే పెద్దు ఎత్తున ఉద్యమాలు చేసేందుకు కేసీఆర్ ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే అవినీతి కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సీఎం జగన్ కేసీఆర్ నిర్ణయాలపై ఏరకంగా స్పందిస్తారనే విషయం ఆసక్తిగా మారనుంది.
Must Read ;- పోలవరం పరిహారాన్ని దోచుకుతింటున్నారు : పట్టాభి