పోలవరం పునరావాస నిధుల్లో పెద్ద ఎత్తున గోల్‌మాల్ జరుగుతోందని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు వైసీపీ ఎంపీ రఘురామరాజు ఫిర్యాదు చేశారు.ఇవాళ ఉదయం ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రిని కలసిన ఎంపీ రఘురామరాజు పోలవరంలో అవినీతిపై ఆధారాలతో వివరించారు. పోలవరం ప్రాజెక్టులో ఖర్చు చేసిన ప్రతి రూపాయిలో 25 శాతం కమీషన్లు డిమాండ్ చేస్తున్నారని ఆయన కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జరుగుతున్న అక్రమాలను రఘురామరాజు కేంద్ర మంత్రికి లిఖిత పూర్వకంగా ఇవ్వడంతో పాటు, పనుల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలు అన్ని వివరించి చెప్పినట్టు తెలుస్తోంది.ఇటీవల పోలవరంలో అదనపు నిర్మాణ పనుల పేరుతో రూ.2500 కోట్లకు పనులు అప్పగించిన విషయాన్ని కూడా రఘురామరాజు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ఇప్పటికే నిలిచిపోయిన నిధులు
ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.20,138 కోట్లకు కుదించిన కేంద్ర ప్రభుత్వం, తాజాగా పోలవరం కాలువ పనుల బిల్లులను తిప్పి పంపిన సంగతి తెలిసిందే. రివర్స్ టెండర్లు అని చెబుతూనే కొత్త పనులు కేటాయించడంపై కూడా ఎంపీ రఘురామరాజు కేంద్ర మంత్రి షెకావత్‌కు వివరించారు. పోలవరంలో జరుగుతున్న అక్రమాలను రఘురామరాజు క్షుణ్ణంగా కేంద్ర మంత్రికి వివరించినట్టు తెలుస్తోంది.
Must Read ;- ప్రధాని, గవర్నర్‌లకు ఎంపీ రఘురామరాజు లేఖలు..