ఏపీలో వైసీపీ నేతల ఆగడాలు రోజురోజుకూ హద్దుమీరుతున్నాయి. అధికారం అడ్డంపెట్టుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇదేమీటి అని ప్రశ్నిస్తే.. వేధింపులకు గురి చేస్తున్నారు. మానసికంగా హింసిస్తూ.. ఇబ్బందుల పాలు చేస్తున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వైసీపీ నాయకుడి వేధింపులు భరించలేక ఫీల్డ్ అసిస్టెంట్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రాయవరం మండలం నదురుబాద గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ విత్తనాల ముత్యాల రావు సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. వైసీపీ జిల్లా ప్రచారకమిటీ కన్వీనర్ సిరిపురపు శ్రీనువాసరావు వేధింపులు భరించలేకే తాను ఈ పని చేస్తున్నట్లు సెల్ఫీ వీడియోలో స్పష్టంగా తెలిపాడు. పురుగుల మందుతాగుతూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అతని ఆరోగ్య పరిస్ధితి విషమించటంతో రామచంద్రపురం ఏరియా హాస్పిటల్ కు తరలించారు.
మానసికంగా వేధిస్తారా..
వైసీపీ జిల్లా ప్రచారకమిటీ కన్వీనర్ సిరిపురపు శ్రీనువాసరావు మానసికంగా వేధిస్తున్నారని ఫీల్డ్ అసిస్టెంట్ ఆవేదన వ్యక్తం చేశాడు. దళితుడిగా పుట్టడమే నేరామా.. అంటూ కంటతడిపెట్టాడు. ఇలాంటి బతుకు బతకడం కన్నా చావడం.. మేలంటూ రోదించాడు. తాను దళితుడు కావడం వల్లనే వేధింపులకు గురవుతున్నట్లు ఆరోపించాడు. వైసీపీ ప్రభుత్వంలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని పలు దళిత సంఘాలు మండిపడ్డాయి. ఇప్పటికైనా పోలీసులు స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశాయి. కాగా ఉపాధి హామీ కూలీల హాజరు సక్రమంగా వేయడం లేదని, ముత్యాల రావుపై కొంతమంది గ్రామస్థులు ఫిర్యాదు చేయడం కూడా మరో కారణంగా తెలుస్తోంది.
Must Read ;- సర్వేలో నిర్లక్ష్యం : 33 మంది వాలంటీర్లు ఔట్











