ఎక్కడైతే బలమైన నాయకత్వం ఉంటుందో.. అక్కడే సంక్షేమం ముందుకెళ్తుంది. ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు తీరు కూడా సక్రమంగా ఉంటుంది. కానీ పాలనపై కనీస అవగాహన లేనివాళ్లు అధికారం చేపడితే.. అడుగడుగునా తప్పిదాలే చోటుచేసుకుంటాయి. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తీరు కూడా ఇలానే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన తాడేపల్లి అత్యాచార ఘటనలో బాధితురాలికి ప్రభుత్వం ఇచ్చిన చెక్కు చెల్లకపోవడం చర్చనీయాంశమైంది. ప్రభుత్వం బాధిత యువతికి చెక్కులను మంజూరు చేసింది. రూ.5లక్షల చెక్కు అందించింది. అదే సమయంలో గుంటూరు జిల్లా ఐసీడీఎస్ అధికారులు కూడా రూ.25వేల చెక్కును అందజేశారు. ప్రభుత్వం ఇచ్చిన రూ5లక్షల చెక్కు నగదు రూపంలో బ్యాంకు ఖాతాలో జమైంది. అయితే.. జిల్లా ఐసీడీఎస్ అధికారులు ఇచ్చిన రూ.25 చెక్కు బౌన్స్ అయ్యింది. చెక్కుల వ్యవహరంపై విమర్శలు రావడంతో, అధికారులు ఒకటి, రెండు రోజుల్లో డబ్బులు అందిస్తామని చెప్పడం గమనార్హం.
రెండు వారాలు గడుస్తున్నా..
తాడేపల్లి అత్యాచార తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి అందరికీ తెలిసిందే. ఏపీ సీఎం నివాసానికి కూతవేటు దూరంలో ఈ సంఘటన చోటుచేసుకోవడం పలు విమర్శలకు దారి తీసింది. ప్రభుత్వ నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తోంది. ఈ ఘటన జరిగి రెండు నెలలు గడుస్తున్నా నిందితులను అరెస్టు చేయకపోవడం ప్రభుత్వ తీరుకు అద్దం పడుతోందని పలువురు విమర్శిస్తున్నారు. ఆ ఘటనపై స్పందించిన ఏపీ ప్రభుత్వం… బాధితురాలికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించి చేతులు దులుపుకుందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇప్పటికైనా బాధిత యువతికి అన్నివిధాలుగా సాయం చేయాలని డిమాండ్ చేశాయి.
Must Read ;- జగన్ సర్కారు తీరుతోనే ఏపీలో కరోనా కల్లోలం : చంద్రబాబు











