ప్రముఖ గాయకులు ఎస్పీ బాల సుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి మెరుగు పడుతోంది. ఆయన ఆరోగ్యం గురించి తాజా సమాచారాన్ని తెలిపిన తనయుడు ఎస్పీ చరణ్ తెలియజేశారు. నాన్నగారు కోలుకుంటున్నారు, వైద్యానికి చక్కగా స్పందిస్తున్నారు స్పందిస్తున్నారు అని చరణ్ మీడియా వివరించారు.
చరణ్ మాటల ప్రకారం.. ఫిజియోథెరపీ లో ఎస్పీ బాలసుబ్రమణ్యం.. చాలా హుషారుగా పాల్గొంటున్నారు. ఎక్స్ రేలు చూసి ఊపిరితిత్తులు చాలా క్లియర్ గా ఉన్నాయి అని డాక్టర్లు చెబుతున్నారు. ఇన్నాళ్లుగా పడకలోనే ఉన్న బాలు, 5-20 నిమిషాలపాటు కూర్చో గలుగుతున్నారు.
త్వరలోనే నోటి ద్వారా ఆహారాన్ని అందించనున్నట్లు కూడా ఎస్పీ చరణ్ తెలియజేశారు. వీలైనంత తొందర్లోనే ఎస్ంపీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం పూర్తిగా కుదుట పడి ఇంటికి చేరుకుంటారని అభిమానులు ఆశిస్తున్నారు. బాలసుబ్రమణ్యం ఆరోగ్యం కోసం చాలా చోట్ల అభిమానులు పూజలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య సమాచారం తెలియజేసిన చరణ్.. నాన్న కోలుకోవాలని ప్రార్థించిన వారికి ధన్యవాదాలు కూడా తెలియజేశారు.











