ఝుమ్మందినాదం, వస్తాడు నా రాజు, మిస్టర్ పర్ ఫెక్ట్, వీర, దరువు, మొగుడు, గుండెల్లో గోదారి, షాడో, సాహసం, ముని 3, గేమ్ ఓవర్.. ఇలా విభిన్న కథా చిత్రాల్లో నటించి.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకుంది. తెలుగు, తమిళ్ చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు బాలీవుడ్ లో లేడీ ఓరియంటెడ్ మూవీస్ లో నటించి బాగా ఫేమస్ అయ్యింది. ఇటీవల తప్పడ్ అనే సినిమాలో నటించి మెప్పించిన తాప్సీ ప్రస్తుతం మరో లేడీ ఓరియంటెడ్ మూవీలో నటిస్తుంది. ఈ మూవీ టైటిల్ రష్మీ రాకెట్. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే ఈ సినిమాలో తాప్సీ అథ్లెట్ గా నటించనున్నారు.
అథ్లెట్ క్యారెక్టర్ కోసం తాప్సీ చాలా కష్టపడుతున్నారు. ఒక ట్రైనర్ ని పెట్టుకుని.. ప్రతి రోజు ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఈ ట్రైనింగ్ కి సంబంధించిన ఫోటోలను తాప్సీ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు. అంతే కాకుండా వీడియో కూడా పోస్ట్ చేసారు. ఆ వీడియో, ఫోటోలు చూస్తుంటే.. ఈ సినిమా కోసం తాప్సీ ఎంత కష్టపడుతుందో అనిపిస్తుంది. ఆమె ఆ పాత్రను బాగా ప్రేమించారు కాబట్టే.. ఆ పాత్రకు న్యాయం చేయాలని ఇంతలా హార్డ్ వర్క్ చేస్తున్నారు అనిపిస్తుంది. ఈ చిత్రానికి ఆకర్ష్ ఖురానా దర్శకత్వం వహించనున్నారు.
ఈ క్యారెక్టర్ కి సంబంధించి తీసుకోవాల్సిన ట్రైనింగ్ పూర్తయ్యిందట. ఈ సందర్భంగా తాప్పీ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ట్రైనింగ్ పూర్తయ్యింది. క్యారెక్టర్ కోసం చాలా కష్టపడ్డాను.. చాలా బాధాకరమే కానీ.. విలువైనది అని తెలియచేసింది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. వచ్చే సంవత్సరం ఈ మూవీని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. లేడీ ఓరియంటెడ్ మూవీస్ తో దూసుకెళుతున్న తాప్సీ ఈ సినిమాతో మరో విజయం సాధిస్తుందని ఆశిద్దాం.
Must Read ;- కాబోయే జంట నిహారిక, చైతన్య డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్.