నవ్యాంధ్రకు పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలను రెడ్ కార్పెట్ పరిచి మరీ ఆహ్వానిస్తోంది. వారికి అవసరమైన సదుపాయాలు కల్పిస్తూ భరోసా నింపుతోంది. ఈ నేపథ్యంలోనే మరో గుడ్‌న్యూస్ చెప్పి సర్కార్. దిగ్గజ సంస్థ గూగుల్ ఏపీకి వచ్చేందుకు రెడీ అయింది. అమరావతిలో పెట్టుబడులు పెట్టనుంది.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో గూగుల్ ప్రతినిధులు చర్చలు నిర్వహించారు. తర్వాత అనంతవరం, నెక్కల్లు మధ్య ఉన్న E-8 రోడ్డు పక్కన సర్వే నంబర్లు 10, 12, 13, 15, 16 లో సుమారు 143 ఎకరాల భూమిని గూగుల్‌కు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ స్థలాన్ని గూగుల్‌కు కేటాయించేందు CRDA ముందుకు వచ్చింది. ఈ క్రమంలో సీఆర్డీఏ అధికారులతో కలిసి గూగుల్ సంస్థ ప్రతినిధులు ఆ స్థలాన్ని పరిశీలించారు. ఇక్కడికి సమీపంలో ఎయిర్‌పోర్టు, రైల్వేస్టేషన్ కూడా రానుండడంతో గూగుల్ సంస్థ ప్రతినిధులు ఈ స్థలం వైపే మొగ్గు చూపారు. గూగుల్ సంస్థను ఇక్కడ నెలకొల్పితే పారిశ్రామికంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
గడిచిన ఐదేళ్లూ ఏపీలో విధ్వంసం కొనసాగింది. ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటనే వణికిపోయే పరిస్థితి అంటే జగనాసుర పాలన ఎలా కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు. కొత్త పరిశ్రమలకు ఆహ్వానం పలకకపోగా..ఉన్నవాటిని జగన్ రాక్షస దండు తరిమే ప్రయత్నం చేసింది. స్కాములతో జాతీయ స్థాయిలో రాష్ట్రం పరువు తీసేసింది. జగన్ సైతం ఏనాడూ రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోలేదు. ఎప్పుడూ కేసుల నుంచి రక్షణ కోసమే అధికారాన్ని వాడుకున్నారు.
కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీన్ మారిపోయింది. జాతీయ స్థాయిలో ఏపీకి పరపతి పెరిగింది. ఇదే అవకాశంగా చంద్రబాబు సైతం రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వయసును లెక్కచేయకుండా పారిశ్రామికవేత్తలు, అధికారులతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్రానికి పెట్టుబడులను తెచ్చేందుకు కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు. రాబోయే 5 – 10 ఏళ్లలో నవ్యాంధ్ర ముఖ చిత్రాన్ని మార్చాలని కంకణబద్ధులై సాగుతున్నారు.











