దెందులూరు మాజీ ఎమ్‌ఎల్‌ఏ, వైసీపీ నేత అబ్బయ్య చౌదరి వైసీపీకి గుడ్ బై చెప్పాలనుకున్నారా..??? ఫ్యాన్ పార్టీ నుండి పారిపోయి… మరో పార్టీ కండువా కప్పుకోవాలని భావించారా..?? జగన్ విధానాలు నచ్చక ఆయన తాడేపల్లి ప్యాలెస్ నుండి జంప్ చేయాలని ఆశించారా.?? రాజకీయ వర్గాలలో గత రెండు వారాలుగా ఇదే చర్చ నడుస్తోంది.. తాజాగా ఈ వార్తలపై అబ్బయ్య చౌదరి స్పందించారు.. తాను పార్టీ మారేది లేదని, రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి తాను వీర విధేయుడినని ప్రకటించారు.. వైసీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు దెందులూరు మాజీ ఎమ్‌ఎల్‌ఏ.
2019 ఎన్నికలలో అత్యంత దారుణంగా ఓడిపోయింది వైసీపీ.. ప్రతిపక్ష హోదా లేకుండా ప్రజలు ఆ పార్టీకి, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పారు.. జగన్ రాజకీయ భవిష్యత్తుపై ఈ ఎన్నికలు నీలినీడల్ని కమ్మింది.. ప్రభుత్వంలో ఉన్న సమయంలో జగన్ తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు, ఆ పార్టీ భవిష్యత్తుని ప్రశ్నార్ధకం చేశాయి.. ముఖ్యంగా, రాజధాని లేని రాష్ట్రంగా అమరావతిని మార్చాడు జగన్.. మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడాడు.. పోలవరం ప్రాజెక్ట్‌ని గాలికి వదిలేశాడు. ఇక, అవినీతి, అక్రమాలు, అరాచకం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత బెటర్ అన్నట్లుగా మారింది పరిస్థితి.. దీంతో, జగన్ పార్టీలో ఉంటే తమకు ఫ్యూచర్ ఉండదని లెక్కలు వేసుకున్న అనేక మంది వైసీపీ నేతలు పక్క దారులు చూస్తున్నారు.. ఈ లిస్టులో అబ్బయ్య చౌదరి పేరు కూడా వినిపిస్తోంది..
అబ్బయ్య చౌదరి.. ఇటీవల తాను టీడీపీలోకి వస్తానంటూ లీకులు ఇచ్చాడని తెలుస్తోంది.. కొంతమంది నేతలతో సీక్రెట్ రాయబారం పంపారని సమాచారం.. ఇక్కడే అధిష్టానానికి కొత్త చిక్కుముడి వచ్చింది.. దెందులూరులో గత రెండు దశాబ్దాలుగా ఎమ్‌ఎల్‌ఏ చింతమనేని బలంగా ఉన్నారు.. 2019లో ఓడిపోయినా, ఆయన టీడీపీ, ఆ పార్టీ అధిష్టానం పట్ల అత్యంత విశ్వసనీయంగా ఉన్నారు.. 2024లో గెలిచి నియోజకవర్గంలో మరోసారి తన పట్టు నిలుపుకున్నారు.. చింతమనేనికి ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉండడంతో అబ్బయ్య చౌదరి ఎంట్రీకి మార్గం సుగమం కావడం లేదని రాజకీయవర్గాలలో చర్చ సాగుతోంది..
మరోవైపు, 2029లో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే, అబ్బయ్య చౌదరికి రూట్ క్లియర్ అయ్యే అవకాశం ఉంది.. దీంతో, కొంతకాలం వేచి చూడాలని టీడీపీ హై కమాండ్ నుండి సంకేతాలు వెళ్లాయట. ఈ మేటర్… జగన్ వరకు చేరడంతో అబ్బయ్య చౌదరి మీడియా ముందుకు వచ్చి ప్లేట్ ఫిరాయించారని సమాచారం.. తాను వైసీపీలోనే కొనసాగుతానని, టీడీపీ కండువా కప్పుకునే ప్రశ్నే లేదని తేల్చి చెబుతున్నారు అబ్బయ్య చౌదరి.. తెరముందుకు వచ్చి ఇలాంటి డైలాగులు పలికినా, తెరవెనక ప్రయత్నాలు జోరుగా చేస్తున్నాడట.. సైకిల్ సవారీకి రెడీ అయిన ఆయన, ఎప్పుడు గ్రీన్‌సిగ్నల్ లభిస్తుందా అని వేచి చూస్తున్నారని చర్చ జరుగుతోంది.. మరి, అబ్బయ్య చౌదరికి టీడీపీ హైకమాండ్ ఎప్పుడు రూట్ క్లియర్ చేస్తుందో, లేక రెడ్ సిగ్నల్ ఇస్తుందో అనేది ఆసక్తికరంగా మారుతోంది..











