వైసీపీ అధికారంలోకి రాగానే ఏపీలో రెడ్ల హవా నడుస్తోందని వార్తలు వచ్చాయి. ఆ వార్తలను తప్పని నిరూపించవలసిన సీఎం జగన్ అందుకు విరుద్ధంగా ప్రవర్తించడంపై మేధావులు, రాజకీయ నిపుణులు ఆవేదన చెందుతున్నారు. తమ కులాన్ని ప్రేమించుకోవడం తప్పు కాదు కానీ వేరే కులాన్ని నిందించడం, దూషించడం తప్పు అనే నైతికతను మరిచి వైసీపీ నాయకులు ప్రేలాపనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు ఒక్కొక్కరు తమ ఆవేదనను తెలియచేస్తున్నారు. ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ తన ఆవేదనను తెలియచేయగా తాజాగా టీడీపీ సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇది మంచి పద్ధతి కాదని జగన్ సర్కార్ కు హితవు పలికారు.
పుచ్చలపల్లి, తరిమెలతో పని చేసిన కమ్మ వర్గానికి అవమానాలు
స్వాతంత్రానికి పూర్వమే కమ్మ జాతి ప్రజలు పారిశ్రామిక వేత్తలుగా వెలిగిన వారు కమ్మవారాని ఆయన గుర్తు చేశారు. నాడు పుచ్చలపల్లి, తరిమెల నాగిరెడ్డి లాంటి మహానాయకులుతో కలిసి పని చేసిన కమ్మ వర్గం ఇప్పుడు అనేక అవమానాలకు గురి అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఎదుగుదలలో భాగస్వాములు అయ్యింది కమ్మ జాతి కాదా అంటూ ఆయన ప్రశ్నించారు. యువకుడు సిఎం కావడంతో ఏదో మంచి చేస్తాడు అని మేము ఆశించామని అందుకు విరుద్ధంగా జరుగుతోందని ఆయన మండిపడ్డారు. ప్రతి పార్టీకి కులాన్ని ఆపాదించి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. సిఎంకు తన కులం మీద ప్రేమ ఉంటే చూపుకోవచ్చు…కానీ కమ్మ జాతి ఏం చేసిందని ఇబ్బంది పెడతున్నారని ఆయన విమర్శలు చేశారు. చంద్రబాబు హయాంలో రెడ్లకు కాంట్రాక్టులు ఇవ్వలేదా! అని గుర్తు చేశారు.
రాష్ట్రంలో అన్నీ కులాలు కలిసి ఓటు వేస్తేనే వైసీపీ సర్కార్ కు 151 సీట్లు వచ్చిన విషయాన్ని ప్రభుత్వం గుర్తు ఉంచుకోవాలని ఆయన హెచ్చరించారు. కమ్మ వారి విషయాన్ని ప్రక్కన పెడితే రాష్ట్రంలో కాపులు, బిసిలు లేరా…అన్నీ పోస్టులు ఒకే కులానికా! అంటూ ప్రభుత్వ తీరును తప్పు పట్టారు. 100 మంది కమ్మ వర్గ పోలీసు అధికారులుకు ఇప్పటికీ పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టారని ఇదేంటని ప్రశ్నించారు. తూర్పులో వంతాడ మైన్స్ లో రెండు వర్గాలలో ఒక వర్గాన్ని వెల్ల గొట్టారని ఇది దారుణమని తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఇలాగే ప్రభుత్వ తీరు ఉంటే రాష్ట్ర ప్రజలు బుద్ది చెబుతారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఏ కుల బలం ఉందని తనను రాజమండ్రి నుంచి 6 సార్లు గెలిపించారని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఆయన వైసీపీ ప్రభుత్వంలో దారుణమైన పరిస్థితులు నెలకొనడంతో ఇప్పుడు మాట్లాడాల్సి వస్తుందని తన విచారాన్ని వ్యక్తం చేశారు.
కమ్మ కులానికి ప్రతినిధిగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వ్యవహరిస్తున్నాడని వైసీపీ నాయకులు ఆరోపిస్తుండగా సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్ ఓ అడుగు ముందుకేసి కమ్మ కులానికి ప్రతినిధిగా ఎన్నికల కమీషనర్ వ్యవహరిస్తున్నాడని ఆరోపణలు చేయడం గమనార్హం. తమ కులానికి ‘మేళ్ళు’ చేయడం చాలా చూసే ఉంటాం. కానీ వేరే కులాన్ని దూషించే దారుణమైన పద్దతిని ఇప్పుడే చూస్తున్నామని మేధావులు ఆవేదన చెందుతున్నారు.
Sri @GORANTLA_BC addressing the media about the caste based politics being run by the YCP Govt – Live #ThisIsVasthavam #JaganFailedCM #APInUnsafehands https://t.co/rLf7cRtwki
— Telugu Desam Party #StayHomeSaveLives (@JaiTDP) August 27, 2020