రేపట్నుంచీ తెలంగాణలో పదిరోజుల పాటు లాక్ డౌన్ ఉంటుంది అని ప్రభుత్వం ప్రకటించగానే మందుబాబులు వైన్స్ ముందు క్యూ కట్టారు. లాక్ డౌన్ పై ప్రకటన చేసిన కొద్ది నిమిషాల్లోనే మద్యం షాపులవైపు పరుగులు పెట్టడం అందరినీ ఆశ్చర్యపర్చింది. కనీసం మాస్కలు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా మద్యం కోసం ఎగబడ్డారు. ఒక్కొక్కరూ ఫుల్ బాటిల్స్ పట్టుకెళ్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఒక్కసారిగా మందు బాబులు ఎగబడటంతో హైదరాబాద్ లోని వైన్స్ షాపుల యజమానులు కటుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. షాపుల ఎదుట భారీ కేడ్లు ఏర్పాటు చేశారు. రేపట్నుంచే ఉదయం 10 గంటల వరకే షాపులు తెరుచుకోనుండటంతో మద్యం షాపులు ఇలా కిక్కిరిసిపోయి కనిపించాయి.
జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!
మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...










