మెగా ప్రిన్స్ వరుణ్ తేజ .. ప్రస్తుతం ఒకేసారి ‘గని, ఎఫ్ 3’ చిత్రాల్ని ట్రాక్ మీద పెట్టిన సంగతి తెలిసిందే. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘గని’ . బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతుంటే… ‘ఎఫ్ 3’ మూవీ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది. డిఫరెంట్ జోనర్స్ లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ రెండు సినిమాల షూటింగ్స్ కు కరోనా సెకండ్ వేవ్ బ్రేకులేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే తిరిగి షూట్ కు వెళ్ళబోతున్నాయి.
ఇదిలా ఉంటే.. వరుణ్ తేజ తదుపరి చిత్రానికి అప్పుడే ముహూర్తం ఖాయమైందనే వార్తలొస్తున్నాయి. ‘ఛలో, భీష్మ’ సినిమాలతో వరుస హిట్స్ అందుకున్న వెంకీ కుడుముల .. వరుణ్ తేజ తో తన మూడో సినిమా చేయబోతున్నాడని సమాచారం. తన గత రెండు చిత్రాల తరహాలో సాగే.. ఓ వెరైటీ లవ్ స్టోరీని ఈ సినిమా కోసం రాసుకున్నాడట. ఆ కథ వరుణ్ కు బాగా నచ్చి.. సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్.
ఈ సినిమా దసరాకి సెట్స్ మీదకు వెళ్ళబోతోందని ఫిల్మ్ వర్గాల వారి భోగట్టా. ఇక ఈ సినిమా స్ర్కిప్ట్ బాగా వచ్చిందని .. వెంకీ కి హ్యాట్రిక్ ఖాయమని అంటున్నారు. ఇక ఈ సినిమాలో ఆయన సెంటిమెంట్ ప్రకారం ఫస్ట్ అండ్ సెకండ్ మూవీస్ లో కథానాయికగా నటించిన రష్మికా మందన్ననే కథానాయికగా ఎంపిక చేయబోతున్నాడట. మరి ఈ సినిమా వరుణ్ కు ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి.











