‘నీకు ఫుడ్ కావాలా? సెక్స్ కావాలా?’ అంటే కొందరు సినిమా పర్సనాలిటీల నుంచి వస్తున్న సమాధానం సెక్స్. ‘నీకు మందు కావాలా? డ్రగ్స్ కావాలా?’ అంటే అంతటా వినవస్తున్న సమాధానం డ్రగ్స్.. ఇదీ నేటి సినిమా రంగం దుస్థితి. సినిమా సెన్సెక్స్ ఇలా దూసుకు పోయి ఎటు పోతుందో అర్థం కావడం లేదు. సినిమా అంటేనే అదో రంగుల ప్రపంచం. జనం దగ్గర ఉన్న డబ్బంతా అటు మద్యం షాపులకూ, ఇటు సినిమా రంగానికీ వచ్చి చేరుతోంది. కొత్తగా మద్యం స్థానంలో మాదక ద్రవ్యాలు చేరుకున్నాయి. జనంలో ఈరోజున ఏదైనా హాట్ టాపిక్ ఉంది అంటే అది ఇదే. సమాజంలో ఇంతకుమించిన అంశాలు లేవా అంటే ఉన్నా అవేమీ జనానికి పట్టవు.
సెలబ్రిటీల విషయంలో ఏ చిన్న విషయం జరిగినా అది చిలవలు పలవులుగా జనంలోకి వెళ్లిపోతుంది. మా ఎన్నికలు అనేది అదో ఇంటర్నేషన్ సమస్య అయి కూర్చుంది. సినిమా రంగంలో ఏ చిన్న పరిణామం తలెత్తినా జనంలో వైరల్ అవుతుందంటే సెలబ్రిటీలు జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మాంసం తిన్నాం కదా అని బొమికలు మెడలో వేసుకున్నట్టుగా ఎర్రగా బుర్రగా ఉండే యువకుడి తొడల మీద ఓ హీరోయిన్ కాళ్లు ఆరజాపుకుని పడుకున్న ఫొటోను వాళ్లే సోషల్ మీడియాలో షేర్ చేస్తే జనం ఏమని అర్థం చేసుకోవాలి? భర్త అనే వ్యక్తి ఉండగా అతనికి చెప్పకుండా గోవాలో షికార్లు కొడితే ఎలా సహించాలి? మనిషికి స్వేచ్ఛ ఉండొచ్చుగానీ మితిమీరిన స్వేచ్ఛ ఎప్పటికీ ప్రమాదకరమని సమంత లాంటి హీరోయిన్లు గుర్తెరగాలి.
ప్రీతిమ్ జుకల్కర్ అనే డిజైనర్ పై నెటిజన్లు ట్రోల్స్ దాడి చేస్తున్నారంటే తప్పెవరిది? పచ్చని కాపురంలో చిచ్చు రేగడానికి ఇలాంటి ఘటనలే కారణం కదా. గతంలో ఏం జరిగినా వివాహం జరిగి ఓ మంచి కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టాక కొంత సంయమనం అవసరం. నాగచైతన్య, సమంత విడిపోయే విషయంలో సమాజం అంతా సమంతనే వేలెత్తి చూపుతోంది. క్యాస్టింగ్ కౌచ్, కమిట్ మెంట్స్ లాంటి పదాలు సినిమా రంగంలోనే ఎక్కువ వినిపిస్తుంటాయి. ఇది ఇతర రంగాలలో లేదా అంటే లేదని చెప్పలేం. వినోదం రంగం కాబట్టే అందరూ దీన్ని బూతద్దంలో చూస్తున్నారు.. బూతు అర్థాలు వెతుకుతున్నారు.
డ్రగ్స్ వ్యవహారం సంగతేంటి?
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మరణం తర్వాత అతని ప్రియురాలు రియా చక్రవర్తి విచారిస్తే డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చింది. దీని మీద ఎన్సీబీ పూర్తిస్థాయిలో దృష్టిపెట్టింది. సినిమా రంగంలో మాదక ద్రవ్యాలు ఎంతగా వేళ్లూనుకుపోయాయో బట్టబయలైంది. ఒక్క బాలీవుడ్ లోనే కాదు ఇటు తెలుగు, అటు కోలీవుడ్ లోనూ ఈ కేసు ప్రకంపనాలు సృష్టించింది. రెండు రోజుల క్రితం బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్టు చేసింది. రేవ్ పార్టీలో అతను దొరికిపోయాడు. ఓ క్రూయిజ్ షిప్ లో ఈ రేవ్ పార్టీ జరిగిన సంగతి తెలిసిందే. అరెస్టయినవారి పేర్లు మాత్రమే తెరపైకి వస్తున్నాయి.
దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నవారు ఇంకా ఎంత మంది ఉన్నారో. ప్రస్తుతం అతన్ని వైద్యపరీక్షలకు తరలించారు. ఇలాంటి కేసులో అందరూ బడాబాబులే ఉంటున్నారు. సినిమా రంగంలో డ్రగ్స్ అనే మాట ఈనాటిది కాదు. ఒకనాటి మెగా హీరో ఫిరోజ్ ఖాన్ కుమారుడు ఫర్దీన్ ఖాన్ కూడా ఈ తరహాలోనే వార్తల్లోకి ఎక్కారు. ఇక సంజయ్ దత్ కూడా ఈ డ్రగ్స్ కు బానిసై తర్వాత సాధారణ జీవితంలోకి వచ్చారు. ఇంతలా వేళ్లూనుకుపోయిన డ్రగ్స్ మూలాలను పూర్తిస్థాయిలో పెకలించే విషయంలో ఎన్సీబీ ఎంతవరకు సఫలీ కృతమవుతుందో చూడాలి.
Must Read ;- చైతూకు బాయ్ బాయ్.. కొత్త ఫ్రెండ్ కు హాయ్ హాయ్!











