కృష్ణానదిలో నీటముగిన వేద పాఠశాల విద్యుర్థులు..!
గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం మాదిపాడులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కృష్ణానదిలో స్నానానికి దిగి ఆరుగురు గల్లంతయ్యారు. గల్లంతైయిన వారాంత మాదిపాడు శ్వేత శృంగాచలం వేద పాఠశాలకు చెందిన విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. ఐదుగురు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు గల్లంతు కాగా .. అందులో విద్యార్థులు మృత దేహాలను జాలర్లు వెలికి తీశారు. ఉపాధ్యాయుడు మృతదేహం ఆచూకి ఇంకా లభించలేదు. మృతి చెందిన వారంతా ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు అచ్చంపేట పోలీసులు.
మృతుల వివరాలు ఇలా ఉన్నాయి..!
మాదిపాడు కృష్ణానదిలో దిగి మృతి చెందిన ఐదుగురు విద్యార్ధులు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. శివ శర్మ(14), నితిష్ కుమార్ దీక్షిత్(15), హర్షిత్ శుక్ల(15), శుభం త్రివేది(17), అన్షునం శుక్లా(14) విద్యార్థులు కాగా, వేద పాఠశాల టీచర్ సుబ్రహ్మణ్యం(24) గుంటూరు జిల్లా నరసరావుపేట కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరందురూ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కృష్టానదిలో స్నానానికి దిగి ప్రమాదవశాత్తు నదిలో నీట మునిగి మృత్యువాత పడ్డారు.











