July 13, 2026 2:48 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

వైసీపీ ప‌క్క‌చూపులు.. సిట్టింగుల త‌ల‌రాత ఏమిటో?

వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి గుంటూరు జిల్లా రాజ‌కీయ ముఖ‌చిత్ర‌మే మారపోయే దిశ‌గా వైసీపీ ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంద‌ట‌. రాజ‌ధాని ఎఫెక్ట్ తో ఓడిపోయే ప్ర‌మాదం ఉన్న వైసీపీ సిట్టింగ్ ల‌ను త‌ప్పించేసి.. వారి స్థానంలో బ‌రిలో నిలిచి గెలిచే స‌త్తా ఉన్న టీడీపీ నేత‌ల కోసం ఆ పార్టీ వ‌ల విసర‌నుంద‌ట‌. ఈ బాధ్య‌త‌ల‌ను ప్ర‌భుత్వ స‌ల‌హాదారు సజ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి త‌న భుజానికెత్తుకునేందుకు సిద్ధ‌మైపోయార‌ట‌.

August 25, 2021 at 10:37 AM
in Andhra Pradesh, Latest News, Politics
Guntur YCP Leaders In Dilemma With Sajjala Mark Plan
Share on FacebookShare on TwitterShare on WhatsApp

Guntur YCP Leaders In Dilemma With Sajjala Mark Plan : 

ఏపీలో అధికార పార్టీ వైసీపీలో ఇప్పుడో ఆస‌క్తికర చ‌ర్చ సాగుతోంది. రాష్ట్ర రాజ‌కీయాల్లో కీల‌క జిల్లాగానే కాకుండా, రాష్ట్రంలోనే అత్య‌ధిక ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు క‌లిగిన జిల్లాల జాబితాలో రెండో స్థానంలో ఉన్న గుంటూరు జిల్లాకు సంబంధించి ప్రస్తుతం ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఉన్న వారిలో.. వ‌చ్చే ఎన్నికల నాటికి కొంద‌రిని ప‌క్కన పెట్టడం ఖాయ‌మ‌ని పార్టీకి చెందిన సీనియ‌ర్లే అంటున్నారు. వీరిలో ఒక మ‌హిళా ఎమ్మెల్యేతో పాటు.. ఇద్దరు ఎంపీలు కూడా ఉన్నారు. గుంటూరులో మొత్తం మూడు పార్లమెంటు స్థానాలు ఉంటే.. మొన్న‌టి ఎన్నిక‌ల్లో ఒక‌టి టీడీపీ ద‌క్కించుకుంది. న‌ర‌సారావు పేట‌, బాప‌ట్ల పార్లమెంటు స్థానాల‌ను వైసీపీ త‌న ఖాతాలో వేసుకుంది. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ కొత్త వారికి స్థానం ఇస్తార‌ని.. బాప‌ట్ల‌ నుంచి గెలిచిన‌ నందిగం సురేష్‌ను ఎమ్మెల్యేగా పంపుతార‌ని చ‌ర్చ సాగుతోంది. ఇక న‌ర‌స‌రావుపేట ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌లును కూడా వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఎమ్మెల్యేగా పోటీ చేయించే దిశ‌గా వైసీపీ యోచిస్తోందట‌. అందుకు ఆయ‌న ఏమంటార‌న్న దానితో నిమిత్తం లేకుండానే పార్టీ హైక‌మాండ్ ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంద‌ట‌.

ఆమెను తప్పించి..

ప్రస్తుతం తాడికొండ ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించిన ఫైర్ బ్రాండ్ డాక్టర్ ఉండ‌వ‌ల్లి శ్రీదేవిని ప‌క్కన పెట్టి.. ఆ సీటును నందిగం సురేష్‌కు అప్పగిస్తార‌ని చ‌ర్చ సాగుతోంది. అయితే అదే సీటు కోసం ఎమ్మెల్సీ, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వ‌ర‌ప్రసాద్ సైతం విశ్వప్రయ‌త్నాలు చేస్తున్నారు. మ‌రి శ్రీదేవిని ప‌క్కన‌పెట్టాల్సి వ‌స్తే.. ఆమెను ఎలా స‌ముదాయిస్తారో కూడా చూడాలి. తొలి సారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె ఇప్పుడు ఏకంగా మంత్రి ప‌ద‌వికే గురి పెట్టారు. అలాంటిది వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ సీటు ద‌క్కక‌పోతే ఆమె ఊరుకుంటారా? అన్న‌ది అనుమాన‌మే. అదే స‌మ‌యంలో న‌ర‌సారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస‌రెడ్డిని న‌ర‌సారావుపేట లోక్‌స‌భ సీటు నుంచి పోటీలోకి దింపంపుతార‌ని జిల్లా పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. ఒక వేళ ఎన్నిక‌ల స‌మయానికి టీడీపీలో ఉన్న ఓ బ‌ల‌మైన కుటుంబం క‌నుక‌.. వైసీపీ తీర్థం పుచ్చుకుంటే దీనిని ఆ కుటుంబానికి విడిచి పెట్టి గోపిరెడ్డిని న‌ర‌సారావు పేటకే ప‌రిమితం చేస్తార‌ని అంటున్నారు. ఇక పొన్నూరు ఎమ్మెల్యేకు కూడా సీటు లేన‌ట్టే అంటున్నారు.

రాజధాని ఎఫెక్ట్ తో..?

అదే స‌మయంలో టీడీపీ నుంచి వ‌చ్చే నేత‌ల‌ను దృష్టి లో పెట్టుకుని వైసీపీ నేత‌ల‌కు టికెట్లను కేటాయించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో గుంటూరులో మంచి మార్కులు వ‌చ్చాయి.. క‌దా? జంపింగ్‌ల‌కు టిక్కెట్లు ఇవ్వడం ఎందుకు? అన్న ప్రశ్న పార్టీ వ‌ర్గాల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రస్తుతం గుంటూరుపై రాజ‌ధాని ఎఫెక్ట్ ప‌డింది. అయితే.. స్థానిక ఎన్నిక‌ల్లో ఈ ప్రభావం క‌నిపించ‌క‌పోయినా.. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్రభావం ప‌డే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడున్న నేత‌లే మ‌ళ్లీ రంగంలోకి దిగితే.. వ్యతిరేక ఓటు చీలే ప్రమాదం ఉంద‌ని వైసీపీ నేత‌లు అంచ‌నా వేస్తున్నారు. దీనిని నివారించాలంటే.. రాజ‌ధాని ఎఫెక్ట్ ను జీరో చేసేసే నేత‌ల కోసం వైసీపీ ఎదురు చూస్తోంద‌ట‌. అలాంటి సత్తా క‌లిగిన నేత‌లు వైసీపీలో క‌నిపించ‌డం లేద‌ని, అందుకే ఇత‌ర పార్టీల‌కు చెందిన నేత‌ల‌పై వ‌ల వేసే ప్లాన్ కు రూప‌క‌ల్ప‌న జ‌రుగుతోందని తెలుస్తోంది.

టీడీపీ నేతలకు ఆఫర్లు..

ఈ క్రమంలోనే ప్ర‌జ‌ల్లో సానుభూతి, మంచి ప‌ట్టు ఉన్న ఇత‌ర పార్టీలు.. ప్ర‌త్యేకించి టీడీపీకి చెందిన‌ నేత‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకొని.. ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా అడుగులు వేయాల‌ని వైసీపీ నిర్ణయించుకున్నట్టు స‌మాచారం. సీఎం జ‌గ‌న్‌, పార్టీ కీల‌క నేత స‌జ్జల రామ‌కృష్ణారెడ్డి ఆధ్వర్యంలోనే టీడీపీలో మంచి పేరున్న నేత‌ల‌కు భారీ ఆఫ‌ర్లతో వ‌ల వేసే కార్యక్రమం త్వర‌లోనే మొద‌లు కానుంద‌ని జిల్లా పార్టీ నేత‌లే చెప్పుకుంటున్నారు. అంతేకాకుండా ఈ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ బాధ్య‌త‌ల‌ను ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా కొన‌సాగుతున్న సజ్ఝ‌ల రామ‌కృష్ణారెడ్డి త‌న భుజాల‌పైకి ఎత్తుకోనున్నార‌ట‌. ఈ కార‌ణంగానే గ‌డ‌చిన కొంత‌కాలంగా ఆయ‌న గుంటూరు వ్య‌వ‌హారాల్లో త‌న‌దైన శైలి జోక్యం చేసుకుంటున్నార‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. టీడీపీ నేత‌ల‌ను ఆక‌ర్షించ‌డమంటూ జ‌రిగితే వైసీపీలో కొంద‌రు నేత‌ల త‌ల‌రాత‌లు మారిపోక త‌ప్పదు. ఇప్పుడు ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఫోజు కొడుతున్న వారికి మొండి చేయి త‌ప్ప‌దు. మొత్తంగా జిల్లాలో పార్టీ బ‌లంగా ఉన్నా.. ఇత‌ర పార్టీ నుంచి ప్ర‌త్యేకించి టీడీపీ నేత‌ల‌ను ఆకర్షించాల‌న్న అధిష్ఠానం వ్యూహం ఏమిటో అర్ధం కాక వైసీపీ నేత‌లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.

Tags: #TheLeoNewsandhra pradeshAndhra Pradesh Newsandhra pradesh news todayap breaking news todayap latest newsap newsap politicsap viral newsguntur districtguntur ycp leadersGuntur YCP Leaders Guntur local newsLatest NewsLatest Telugu Newslatest telugu news onlineleo newsPolitical Newssajjala ramakrishna reddysajjala ramakrishna reddy mla constituencytdptelugu latest newstelugu newsyscpysrcp
Previous Post

These Stunning Pics of Esha Gupta Will Make You Go Wow

Next Post

అంత చిన్నదైతే.. ఇంత హ‌డావిడేల‌?

Related Posts

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

by లియో డెస్క్
July 11, 2026 4:45 pm

rహెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి మరో ప్రతిష్టాత్మకమైన గుర్తింపును సొంతం...

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

by లియో డెస్క్
July 6, 2026 10:27 pm

ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

చక్ర (రివ్యూ)

మనిషికి ఎందుకీ తాపత్రయం?

JR NTR Shreds His Muscles For Komaram Bheem

ఎమ్మెల్యే రాజాసింగ్‌కు హైకోర్టులో ఊరట..!

Is Daily Masturbation Safe | Side Effects Of Masturbation | Health Tips In Telugu | Leo Health

ముఖ్య కథనాలు

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist