బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. నాంపల్లి సెషన్స్ కోర్టు వెలువరించిన తీర్పుపై.. హైకోర్టును ఆశ్రయించిన రాజాసింగ్‌కు అనుకూలంగా తీర్పును వెలవరిస్తూ.. అతనికి విధించిన శిక్ష అమలుపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు.
బీఫ్ ఫెస్టివల్ వ్యవహారంలో వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో జనవరి 29న నాంపల్లి సెషన్స్ కోర్టు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీరు వెలువరించిన సంగతి తెలిసిందే. ఆపై వెంటనే బెయిలు కూడా మంజూరు చేసింది. నెలలోగా హైకోర్టును ఆశ్రయించుకోవచ్చని కోర్టు తెలిపింది. అందులో భాగంగా హైకోర్టును ఆశ్రయించిన రాజా సింగ్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది హైకోర్టు. నాంపల్లి సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు.
Must Read ;- రాజాసింగ్‌కు ఏడాది శిక్ష.. బెయిల్..











