ఉదయాన్నే 30 నిమిషాల నడక వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే కొంతమంది ఉదయం బదులు సాయంత్రం వాకింగ్ చేస్తుంటారు. కానీ ఉదయం పూట చేయడం వల్ల చాలా బెన్ ఫిట్స్ ఉన్నాయట. మార్నింగ్ వేళలో నడవడం వల్ల రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండొచ్చని పలు సర్వేలు కూడా చెబుతున్నాయి. ముఖ్యంగా డయాబెటిస్, ఒబేసిటీ, గుండె రుగ్మతలు లాంటివి ఉంటే ఉదయపు నడకతో వీటి తీవ్రత తగ్గుతుంది. కండరాలకు, గుండెకు చాలా మంచిది. మూడ్‌ను బాగా చేసి రోజంతా ఉత్సాహంగా, సానుకూల దృక్పథంతో ఉండేలా చేస్తుంది. 30 నిమిషాల ఉదయపు నడక 2 గంటల జిమ్‌తో సమామని పలువురు సైంటిస్టులు కూడా చెప్పారు.

షూ లేకుండా..
ఉదయాన్నే ఉత్త కాళ్లతో వాకింగ్ చేయడం ఆరోగ్యానికి మంచిది. చాలామంది ప్రముఖులు సైతం ఉత్త కాళ్లతోనే రోజూ వాకింగ్ చేస్తారట. అంటే దానివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అయితే ఉత్త పాదాలతో నడిచేప్పుడు రాళ్లు తేలిన రోడ్లపై కాకుండా.. పచ్చని పచ్చికపై, మెత్తని ఇసుకపై, మట్టిపై నడవండి.

ఆరోగ్య ప్రయోజనాలివే
- కొవ్వును కరిగిస్తుంది.
- బీపీ అదుపులో ఉంటుంది.
- బరువును సమస్యను దూరం చేస్తుంది.
- ఎముకలు బలంగా తయారవుతాయి
- గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
- కొలెస్ట్రాల్ అదుపులోకి వస్తుంది.
- శరీరంలోని కీలక భాగాలపై ప్రభావం
- ఒత్తిడి దూరం
- క్యాన్సర్ ముప్పు తక్కువ
- రోజంతా ఉల్లాసంగా ఉండొచ్చు
Must Read ;- పరిగడుపున కొబ్బరి నీళ్లు తాగితే ఏమవుతుంది?











