టీడీపీ నేతల అరెస్టులు కొనసాగుతూనే ఉన్నాయి.సీబీఎన్ ఆర్మి కో ఆర్డినేటర్,టీడీపీ నేత మాదినేని మహేష్‌ను గుంటూరు అరండల్‌పేట పోలీసులు ఇవాళ అదుపులోకి తీసుకున్నారు.వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ మహేష్‌పై అట్రాసిటీ కేసు నమోదైంది.ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అరండల్‌పేట పోలీసులు మహేష్‌ను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.మఫ్టీలో వచ్చిన కొందరు పోలీసులు మహేష్‌ను జీపులో ఎక్కించుకుపోయారని తెలుస్తోంది.అయితే ఇంత వరకు మహేష్ అరెస్టును చూపలేదు.మహేష్ పోలీసుల కష్టడీలో ఉన్నాడా లేదా అనే విషయంపై కూడా మాట్లాడేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు.మహేష్ అరెస్టుపై టీడీపీ సీనియర్ నేతలు నక్కా ఆనందబాబు,ఆలపాటి రాజేంధ్రప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.మహేష్ అక్రమ అరెస్టుపై హైకోర్టును ఆశ్రయించనున్నట్టు వారు తెలిపారు.
కాపాడాలంటూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి మహేష్ భార్య వినతి
మాదినేని మహేష్ అరెస్టుపై ఆయన భార్య మాదినేని పావని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి మెయిల్‌లో లేఖ రాశారు.మఫ్టీలో ఉన్న కొందరు వ్యక్తులు బలవంతంగా తన భర్తను ఎత్తుకుపోయారని ఆమె లేఖలో పేర్కొన్నారు.తన భర్తపై అక్రమంగా అట్రాసిటీ కేసు పెట్టి పోలీసులు వేధిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.మహేష్ అరెస్టును ఇంత వరకు చూపలేదని,ఇది ఇల్లీగల్ అరెస్టు కిందకు వస్తుందని ఆమె లేఖలో పేర్కొన్నారు.దయచేసి తన భర్తను పోలీసుల నుంచి కాపాడాలని ఆమె లేఖలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని వేడుకున్నారు.
Must Read ;- విజయసాయిరెడ్డి ఆఫర్ ను తిరస్కరించినందుకే : అసలు విషయం ఇదేనన్న పల్లా













