బరవు తగ్గాడానికి ప్రతి ఒక్కరి ముందు కనిపించే మార్గాలు రెండే రెండు. ఒకటి డైటింగ్.. రెండోది వ్యాయామం. ఏది మంచిది? ఒక్కటి పాటిస్తే సరిపోతుందా? ఏది పాటించడం వల్ల మెరుగైన ఫలితాలు పొందవచ్చు? ఇలా ఎన్నో ప్రశ్నలు మన బుర్రను తినేస్తుంటాయి. ఇకపై వాటి కన్నింటికీ చెక్ పెట్టండి. రెండింటి ప్రాముఖ్యం.. దేని ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం రండి..
Must Read ;- వీటిని తింటే.. కొవ్వు ఇట్టే కరిగిపోతుంది..
డైట్ వర్సస్ వ్యాయామం
చప్పట్లు కొట్టాలంటే రెండు చేతులు కలవాలి.. అప్పుడే వాటిని చప్పట్లు అంటారు. కేవలం ఒక్క చేతితో చప్పట్లు కొట్టాలంటే కుదిరేపనేనా.. గాల్లో చేతిని ఆడించడం మినహా ఏం ఉండదు. అదే పాయింట్ ఇక్కడా ఉంటుంది. అటు డైట్ పాటిస్తూ.. ఇది వ్యాయామ ప్రక్రియను చేసినప్పుడే అనుకున్న ఫలితాలు అందుతాయి. కాకపోతే డైట్ కాస్త ఎక్కువ సమానమనే చెప్పాలి. వ్యాయామం కంటే డైట్ ప్రభావం కాస్త ఎక్కువ ఉంటుంది. మన శరీర తీరు, వ్యాయామ సమయాన్ని నిర్ధేశించేది కూడా మనం తీసుకునే ఆహారమే. కాబట్టి మన శరీర బరువు తగ్గాలన్నా.. అదుపులో ఉండాలన్నా.. డైట్ ప్రధాన పాత్ర పోషిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ, డైట్ ఒక్కదానితో మాత్రమే ఫలితాలు అందుకోగలగడం అసాధ్యం. డైట్‌కి వ్యాయామం తోడైతేనే మంచి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని మరిచిపోకూడదు. డైట్ పాటించడం వల్ల శరీరం బరువు అదుపులో ఉంటుంది.. శరీరం ఫిట్‌గా ఉంటాలంటే మాత్రం వ్యాయామం తప్ప వేరే మార్గమే లేదు.
Also Read ;- పొట్ట తగ్గాలా? అయితే ఆహారంలో ఈ మార్పులు తప్పనిసరి!
వ్యాయామం ఎలా చేయాలి?
వ్యాయామం.. ఎంత సేపు చేయాలి? ఏం చేయాలి? ఎలాంటివి చేయాలి? ఇలాంటివి ఎన్నో ప్రశ్నలు. సాధారణంగా శరీరానికి ప్రతిరోజు 30 నిమిషాల వ్యాయమం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. ఎలాంటివి చేయాలి అనేది మీ సౌలభ్యంపై ఆధారపడి ఉంటుంది. డైట్ పాటించేవారు తేలికపాటి వ్యాయామాలు ఎంచుకున్న సరిపోతుంది. కొందరికి వాకింగ్ మాత్రమే చేయగలం అనుకుంటే రోజులో 30-45 నిమిషాలు చేసినా చాలు. కానీ రోజూ వాకింగ్ చేసినా బోర్ కొడుతుంది.. కాబట్టి వ్యాయామాలు కూడా రోజుకో రకం చేసేలా చూసుకోవాలి. అందుకోసం జిమ్స్‌కి పరిగెత్తాల్సిన పని లేదు. మీ ఇంట్లోనే మెట్లతో, కుర్చీలతో, సోఫా, మంచం ఉపయోగించి చేసే వ్యాయామాలు ఎన్నో ఉన్నాయి. అలాంటివి రోజుకోరకం చేయడం వల్ల మీకు కొత్తగా ఉంటుంది.. వ్యాయామం చేయాలనే ఉత్సాహం ఉంటుంది.
Also Read ;- ‘తల్లిపాల’ను పెంచే సూపర్ ఫుడ్స్