టాలీవుడ్ లో ప్రామిసింగ్ హిట్స్ సాధిస్తూ.. వైవిధ్యమైన కథలతో, విభిన్నమైన పాత్రలతో ట్రావెల్ అవుతోన్న యంగ్ హీరో నిఖిల్ సిథ్థార్థ. ఎర్లియర్ గా ఈ హీరో అర్జున్ సురవరం సినిమాతో మంచి విజయం సొంతం చేసుకున్నాడు. అదే ఊపులో త్వరలో ‘కార్తికేయ 2’ చిత్రాన్ని పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ అతడి కిట్టీలో ఉన్నాయి. ఈ లాక్ డౌన్ టైమ్ లో పెళ్ళి చేసుకొని ఒక ఇంటివాడైన నిఖిల్ లో భక్తి ప్రపత్తులు కూడా బాగానే ఉన్నాయి.
ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా సికిందరాబాద్ లోని స్కందగిరిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో 365 దీపాలు వెలిగించి భక్తి పారవశ్యంలో మునిగితేలాడు నిఖిల్. కుటుంబ సభ్యులతో పాటు దేవాలయానికి వెళ్ళిన అతడు అందరితో పాటు దీపాలు వెలిగించాడు. ప్రతీ ఏడాది కార్తికమాసంలో ఈ విధంగా దీపాలు వెలిగించడం తమ కుటుంబానికి ఆనవాయితీ అని ఒక ఫోటో పోస్ట్ చేస్తూ ట్వీట్ చేశాడు నిఖిల్. జనం ఎక్కువగా ఉన్నా సరే.. నిఖిల్ దీపాలు వెలిగించడం విశేషం.
ప్రస్తుతం ‘కార్తికేయ 2’ చిత్రంపైనే తన ఫోకస్ అంతటినీ పెడుతున్నాడు. మొదటి భాగం సూఫర్ హిట్టైన నేపథ్యంలో ఇప్పుడు ఈ సీక్వెల్ మీద భారీ అంచనాలున్నాయి. చందు మొండేటి దర్శకత్వంలోనే రెండో భాగం తెరకెక్కుతోంది. మొదటి భాగానికి మించిన స్థాయిలో ఈ సినిమా ఉంటుందని నమ్మకంగా చెబుతున్నారు. మరి నిఖిల్ కు ఆ సుబ్రహ్మేశ్వర స్వామి అనుగ్రహం నిండుగా మెండుగా దక్కి ఆ సినిమా భారీ హిట్టవ్వాలని కోరుకుందాం.
Karthika Pournami… Lighting 365 Lamps which I do every year 🙏🏼
@ Skandagiri Temple pic.twitter.com/bn8DSPolSH— Nikhil Siddhartha (@actor_Nikhil) November 29, 2020











