మణిరత్నం దగ్గర అసిస్టెంట్ గా చేసి.. ఆయన సినిమాలతోనే నటుడిగా రంగ ప్రవేశం చేశాడు సిద్ధార్ధ. అవన్నీ టాలీవుడ్ లోనూ విడుదలయి.. తెలుగు వారికీ సుపరిచి తుడయ్యాడు. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. తొలి సినిమాతోనే బిగ్గెస్ట్ హిట్టు కొట్టాడు. ఆ క్రెడిట్ తోనే సిద్ధూ వరుసగా అవకాశాలందుకొని.. టాలీవుడ్ లో ట్రెవెల్ అయ్యాడు. ఇక ‘బొమ్మరిల్లు’ సినిమా ఘన విజయంతో సిద్ధార్ధకి టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. అతడి సినిమాలకు యూత్ బాగా కనెక్ట్ అయ్యేవారు. అయితే ఒకదశలో వరుసగా ఫెయిల్యూర్స్ రావడం వల్ల.. సిద్ధూ మదర్ ల్యాండ్ కోలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరిక్షించుకున్నాడు.
అక్కడ కొన్ని సినిమాలతో సక్సెస్ అందుకున్నాడు. ఫైనల్ గా అక్కడే సెటిల్ అయ్యాడు. అలాగే… మరో పక్క హిందీ, మలయాళ సినిమాల్లో సైతం నటించి మంచి పెర్ఫార్మర్ అనిపించుకున్నాడు. సిద్ధార్థ ఆఖరుగా నటించిన తెలుగు సినిమా ఏడేళ్ళ క్రితం వచ్చిన యన్టీఆర్ ‘బాద్షా’. అప్పటికే తెలుగులో తన ఫామ్ ను పూర్తిగా కోల్పోయిన అతడు.. అందులో జస్ట్ గెస్ట్ పాత్రను మాత్రమే పోషించాడు. ఆ తరువాత ‘గృహం’ సినిమాతో తెలుగువారిని మళ్ళీ పలకరించాడు. ఆ సినిమా టాలీవుడ్ లో బాగానే ఆడింది. ఆ తర్వాత కూడా కొన్ని డబ్బింగ్ సినిమాలతో తెలుగువారిని మెప్పించే ప్రయత్నం చేశాడు కానీ అవి వర్కవుట్ కాలేదు.
ప్రస్తుతం ‘సైతాన్ కా బచ్చా, టక్కర్, శంకర్ ఇండియన్ 2’ సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తోన్న సిద్ధార్ధ.. ఇప్పుడు మళ్లీ ఓ స్ట్రైట్ తెలుగు సినిమాలో నటిస్తూండడం విశేషాన్ని సంతరించుకుంది. సినిమా పేరు ‘మహాసముద్రం’. ‘ఆర్.ఎక్స్ 100’ తో సెన్సేషనల్ క్రియేట్ చేసిన అజయ్ భూపతి ఈ సినిమాకి దర్శకుడు. మొదటి సినిమా తర్వాత దాదాపు రెండేళ్ళ గ్యాపిచ్చిన అజయ్.. ఆ టైమ్ అంతటినీ రెండో సినిమాకు సంబంధించిన హీరోల సెలెక్షన్ తోనే గడిపేశాడు. ఎట్టకేలకు ఇప్పుడు అజయ్ భూపతి ‘మహాసముద్రం’ సినిమాకి పెర్ఫెక్ట్ కేస్టింగ్ సెట్ అయింది. ఇందులో హీరోగా శర్వానంద్ నటించబోతున్నాడు. సరైన స్ర్కిప్ట్ తో మళ్లీ ఓ సినిమా సినిమాలో నటించాలని ఎప్పటి నుంచో ఎదురుచూస్తోన్న సిద్ధార్ధకి .
అజయ్ రాసుకున్న మహాసముద్రం స్ర్కిప్ట్ ఎంతగానో నచ్చేసిందట. దాంతో శర్వానంద్ తో స్ర్కీన్ షేర్ చేసుకోడానికి నిర్ణయించుకున్నాడట. నిజానికి ఈ సినిమాను ముందుగా రవితేజ తో తీయాలని అనుకున్న అజయ్ భూపతి… ఎందుకనో ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. ఆ తర్వాత నాగచైతన్యతో కూడా అనుకున్నాడు. కానీ ఆ ట్రయల్ కూడా వర్కవుట్ కాలేదు. ఏదేతేనేం.. మొత్తం మీద అజయ్ భూపతికి రెండేళ్ళు వెయిట్ చేసిన ఫలితంగా శర్వానంద్, సిద్ధార్ధ లాంటి ఇద్దరు టాలెంటెడ్ హీరోలు దొరికారు. మరి ఈ ఇద్దరి కలయికతో ‘మహాసముద్రం’ ఏ రేంజ్ లో బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తుందో? సిద్ధార్ధకు అది ఏ మేరకు హెల్ప్ అవుతుందో చూడాలి.











