ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బార్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో న్యాయవాదుల తోపులాటతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. హైకోర్టు బార్ కౌన్సిల్ ఎన్నికలపై చర్చించేందుకు నిర్వహించిన సమావేశంలో ఘర్షణ చోటుచేసుకుంది. న్యాయవాదుల మధ్య మాటామాటా పెరిగి తోపులాటకు దారితీసింది. కొందరు న్యాయవాదులు కుర్చీలతో పరస్పరం దాడి చేసుకున్నారు. దీంతో బార్ కౌన్సిల్ సభ్యుడు చలసాని అజయ్ కుమార్ తలకు కుర్చీ తగిలి గాయపడగా వెంటనే అతన్ని హాస్పటల్‌కు తరలించారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. జరిగిన ఘటనను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వివరించేందుకు న్యాయవాదులు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.
వర్రా రవీందర్ రెడ్డి రివర్స్ గేర్… సజ్జల గుండెల్లో వణుకు..!
తన దాకా వస్తే గానీ... ఆ కష్టమేమిటన్నది తెలియదట. పోలీసులకు పట్టుబడనంతవరకు భయం...