తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ ఎన్నికల నియామవళిని ఉల్లంఘించారు. నిన్న ఓల్డ్ మలక్‌పేటలోని 588వ పోలింగ్ కేంద్రంలో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకొని మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వాణీదేవికి ఓటు వేశానని చెప్పారు. దాంతో ఆయనపై విమర్శలు వస్తున్నాయి. అయితే ఎన్నికల నియామవళి ప్రకారం ఏ అభ్యర్థికి ఓటు వేశానన్న విషయం బయటకు చెప్పకూడదు. హోంమంత్రి ఈ నిబంధనను పట్టించుకోకుండా బయటకు చెప్పేశారు. దాంతో ఆయన ఓటు వాలిడిటీపై వివాదం నెలకొంది.
ఈ మాత్రం కూడా తెలియదా..
ఇంతకీ హోంమంత్రి వేసిన ఓటు చెల్లుతుందా ? లేదా? అని పట్టభద్రులు చర్చించుకుంటున్నారు. రాష్ర్ట హోంమంత్రికి ఈ మాత్రం కూడా తెలియదా అని విమర్శిస్తున్నారు. కాగా, హోంమంత్రి చేసిన ప్రకటనను కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి జి.నిరంజన్ వీడియో క్లిప్పింగ్ ఆధారాలతో బయటపెట్టారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన హోంమంత్రిపై చర్య తీసుకోవాలంటూ కాంగ్రెస్ నాయకులు ఎన్నికల అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Must Read ;- అక్రమాలకు పాల్పడుతున్న టీఆర్ఎస్.. సీఈవోకు ఉత్తమ్ ఫిర్యాదు











