ప్రస్తుతం తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి కనిపిస్తోంది. ఈ ఎన్నికలు ముగిసిన వెంటనే పార్టీలన్నీ నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక వైపు దృష్టి సారించాల్సి ఉంటుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపోటములు కూడా ఈ అసెంబ్లీ ఉప ఎన్నికపై ఎంతో కొంత ప్రభావం చూపుతాయన్న అంచనాలున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్‌తో పాటే నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ కూడ వస్తుందని భావించినా.. అది జరగలేదు. దీంతో కాంగ్రెస్, టీడీపీ మినహా మిగతా పార్టీలకు కొంత వెసులుబాటు లభించినట్టైంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తమ అభ్యర్థిగా మాజీ మంత్రి, సీనియర్ నేత జానారెడ్డిని ఖరారు చేసింది. టీడీపీ మొవ్వ అరుణ్ కుమార్‌ను ప్రకటించింది.
తెలంగాణలోని కాంగ్రెస్ నేతల్లో సీనియర్
ఇక జానారెడ్డి విషయానికి వస్తే.. తెలంగాణలోని కాంగ్రెస్ నేతల్లో సీనియర్. గతంలో సీఎం రేసులో కూడా ఆయన పేరు వచ్చింది. గతంలో తెలుగుదేశంలో గెలుపొందిన తరవాత బయటకు వచ్చి తెలుగు మహానాడు పార్టీ స్థాపించి..తరువాత కాంగ్రెస్‌లో విలీనం చేసిన జానారెడ్డి..అప్పటి నుంచి కాంగ్రెస్‌లో ఉన్నారు. గత చలకుర్తి, ప్రస్తుత నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానాల్లో 1983 నుంచి ఇప్పటి వరకు 2సార్లు మాత్రమే ఓడారు జానారెడ్డి. ఈ రెండుసార్లు కూడా యాదవ సామాజికవర్గ ప్రత్యర్థుల చేతిలో ఓడడంతో టీఆర్ఎస్ ఇప్పుడు మళ్లీ ఆ సామాజికవర్గానికి చెందినవారికే టిక్కెట్ ఇస్తుందన్న అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది. ప్రచారానికి రూట్ మ్యాప్ పంపాల్సిందిగా సూచించినట్టు సమాచారం.
తానే షెడ్యూల్ ఇస్తానని..
అయితే పార్టీ తనకు చెప్పేవి కేవలం సూచనలేనని, ఆదేశాలు కావని జానారెడ్డి భావిస్తున్నారని పార్టీ నాయకులు చెబుతున్నారు. తాను ధిల్లీ స్థాయి నేతలతో తప్ప.. రాష్ట్రానికి చెందిన నాయకులతో కలసి మీటింగ్‌లు పెట్టే అవకాశం తక్కువని, ఆ ప్రకారం ఇతర ప్రాంతాల నేతలు వచ్చి తనతో కలసి కాకుండా వేరే ప్రాంతాల్లో ప్రచారం చేస్తే స్వాగతిస్తానని జానారెడ్డి చెప్పినట్టు తెలుస్తోంది. తన నియోజకవర్గంలో తన పట్టు నిరూపించుకోవాల్సిన అవసరం వచ్చిందని, కాంగ్రెస్‌లోని ఇతర నేతలు వచ్చి ప్రచారం చేస్తే..తన పట్టు సడులుతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తాను గెలిస్తే సదరు నాయకు తాము జానారెడ్డిని గెలిపించామని చెప్పే అవకాశం ఉందని, అది తనకు నచ్చదనే కారణం ఉన్నట్లు నాయకులు చెబుతున్నారు. అంతేకాకుండా.. గ్రామాలకు, మండలాలకు బాధ్యత కమిటీల ఎంపిక పార్టీకి సంబంధం లేదని, తానే చూసుకుంటానని చెప్పినట్టు సమాచారం.
ఇక ఆర్థికపరంగా.. తన కుమారుడు, కుమారుడి సర్కిల్ ఈ బాధ్యతలు నిర్వర్తిస్తుందని చెప్పినట్టు తెలుస్తోంది. మొత్తం మీద దుబ్బాకలో చేసినట్టు నాగార్జునసాగర్‌లో పార్టీ అడుగడుగునా జోక్యం చేసుకోవద్దని జానా డైరెక్ట్‌గా చెప్పినట్టు తెలుస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. ‘మీటింగ్‌లు పెట్టుకుంటే పెట్టుకోండి.. అదీ వేర్వేరుగా పెట్టుకోండి. నా ప్లానింగ్ నాకు ఉంది. ఆర్భాటాలు అవసరం లేదు. పార్టీకి ఇదే చెప్పాను.’ అని పార్టీలోని ఓ కీలక నాయకుడి వద్ద జానారెడ్డి వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. అయితే జానారెడ్డి వ్యూహాలే పార్టీ వ్యూహాలుగా మారతాయా లేక పార్టీ జోక్యం పెరుగుతుందా అనేది చూడా
Also Read : ఎమ్మెల్సీ ఎన్నికల వేళ.. తెలంగాణలో ప్రాజెక్టుల మోత