గ్రేటర్ హైదరాబాద్ లో వరదలు సృష్టించిన బీభత్సం బయట పడుతోంది. వర్షం నిలిచిపోయి మూడు రోజులు కావస్తుండటంతో నగరం మెళ్ళమెళ్ళగా కోలుకుంటోంది. గండ్లు పడ్డ చెరువుల్లో నీరు అడుగంటి పోయాయి. దీంతో నాలాల్లో , కాలనీల్లో నీటి ప్రవాహం తగ్గుతోంది. మూడు రోజుల పాటు నీటమునిగిన కాలనీల్లో ప్రజలు ఇప్పుడిప్పుడే బయటకువస్తున్నారు. ఇక ఇల్లముందు నిలిపిన వాహనాలు కినిపించక షాక్ గురవుతున్నారు ప్రజలు. వరదలకు ముందు ఇంటి ముందు నిలిపిన కారు వరదలు తగ్గేసరికి కనిపించ కుండా పోవడంతో ఆందోళన చెందుతున్నారు నగర వాసులు. తమ వాహనాలు ఎక్కడికి వెళ్ళాయంటూ రోడ్లపై వెతకండం ప్రారంభించారు. వరద నీరు పోయే మార్గాల్లో గాలిస్తూ వాహనం వెతుక్కుంటున్నారు. కొన్ని వాహనాలు కాలనీ చివర్లో రోడ్లపై ధీనా వస్తలో కనిపిస్తుండగా మరికొన్ని వాహనాలు నాలాలు, చెరువుల్లో దర్శనం మిస్తున్నాయి.
అర్దరాత్రి వచ్చిన వరదలతో ప్రజలు తమ ప్రాణాలు కాపాడుకునేందుకే సమయం చోటు లేని పరిస్థితి. అలాంటి సమయంలో ఇంటి ముందు, ఇంట్లో పార్క్ చేసిన వాహనాల గురించి పట్టించుకునే సమయం ఎక్కడిది. ఒక్క సారిగా భారీ వరద నీరు పోటెత్తడంతో అందులోనే కార్లు, లారీలు, వ్యాన్లు కోట్టుకు పోయాయి. కాలనీల్లో కార్లు కొట్టుకు పోవడం ఓ లెక్కా. సరిగ్గా ఇలాగే గత మూడు రోజుల క్రితం నగరంలో వచ్చిన వరదలకు వందల సంఖ్యలో కార్లు, బైకులు నీల్లలో కొట్టుకు పోయాయి. మూడురోజుల పాటు కనీసం ఇంటి నుండి బయలకు వచ్చే పరిస్థితి లేక పోవడంతో తమ వాహనం ఎటుపోయిందో అని ఆలోచించే తీరిక కూడా లేకుండా పోయింది.. దాహమేస్తే తాగేందుకు కూడా నీరు లేని పరిస్థితుల్లో వాహనం గురించి ఆలోచన ఎలా వస్తుందంటున్నారు వరద బాదితులు. వరద తగ్గిన తరువాత తమ వాహనాలు వెతుక్కోవడం ప్రారంభించారు ప్రజలు. ఇలా వెతుక్కుంటూ చాలా మంది కనిపిస్తున్నారు నగరంలో. వాహనాలు కనిపించినా వాటిని ఇంటికి తీసుకు రాలేని దుస్థితి. వరదల్లో మునిగిన కారును అలాగే స్టార్ట్ చేస్తే ఇక ఎందుకు పనికి రాదు.. దీంతో మెకానిక్ లు , సర్వీస్ సెంటర్లకు ఫోన్లుచేసి తమ వాహనాలను టోయింగ్ చేయించి షెడ్డుకు చేరుస్తున్నారు.
చాలా వరకు కార్లు నాలాల్లోనే దర్శనం ఇస్తున్నాయి. చెరువు నుండి మరో చెరువుకు వెళ్ళే నాలాల్లో కొట్టుకు పోయిన కార్లు ఇరుకు కాలువల వద్ద ఇరుక్కు పోయాయి. ఒకదాని వెనక మరోకారు ఇలా పదుల సంఖ్యలో కార్లు నాలాల్లో దర్శన మిస్తున్నాయి. నాలా కల్వర్టుల వద్దే ఎక్కువగా ఇరుక్కు పోయిన కార్లు కనిపిస్తున్నాయి. ఒక్కో కల్వర్ట్ వద్ద తీసిన కొద్ది కార్లు దర్శనమిస్తున్నాయి. రోజుకో కారు ఒకే నాలాలో బయట పడుతుండటంతో వాహన యజమానుల్లో గుబులు రేపుతోంది. ఇలా తమ వాహనం నాలాలోనే దర్శనమిస్తుందా… ఏ నాలాలో దర్శనమిస్తుందో అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇంటి నుండి వరదల్లో కొట్టుకు పోయి నాలాల్లో దొరుకుతున్న వాహనం పూర్తిగా నుజ్జునుజ్జు అయిన స్థితిలో బయట పడుతున్నాయి.. స్క్రాప్ కు వేయడం మినహా వేరే మార్గం లేదు. దీంతో తమ వాహనం జాడ దొరికే చాలన్నట్టుగా వెతుకుతున్నారు నగర వాసులు.