ప్రస్తుతం టాలీవుడ్ లో కన్నడ బ్యూటీ పూజా హెగ్డే.. కథానాయికగా టాప్ లీగ్ లో ఉంది. ఈ ఏడాది ‘అల వైకుంఠపురములో, భీష్మ’ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బ్లస్టర్స్ ఖాతాలో వేసుకొని మిగతా భామలకు గట్టి పోటీగా మారింది. అందుకే ఈ భామకు దానికి తగ్గట్టుగానే టాప్ స్టార్స్ పక్కన వరుస అవకాశాలు వస్తున్నాయి. ఆ కారణంగానే పూజా తన పారితోషికాన్ని ఓ రేంజ్ లో పెంచేసిందని ఫిల్మ్ నగర్ టాక్.
కోరనా వైరస్ కారణంగా వచ్చి పడిన లాక్ డౌన్ కారణంగా .. టాలీవుడ్ హీరోలందరూ తమ రెమ్యూనరేషన్ లో స్వచ్ఛందంగా 20 శాతం కోత విధించుకున్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో.. పూజా నే కావాలని కోరుకుంటున్న బడా దర్శక నిర్మాతల్ని ఆమె ఏకంగా రూ. 2.5 కోట్లు పారితోషికం డిమాండ్ చేస్తోందట. ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాధేశ్యామ్’ లోనూ, అఖిల్ హీరోగా నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్’ సినిమాల్లో కథానాయికగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. వీటితో పాటు ఆమె సల్మాన్ ఖాన్ తాజా చిత్రం ‘కభీ ఈద్ కభీ దీవాలి’ మూవీలోనూ కథానాయికగా నటిస్తోంది.