మిల్కీ బ్యూటీ తమన్నా, టాలెంటెడ్ యంగ్ హీరో సత్యదేవ్ జంటగా నటిస్తోన్న రొమాంటిక్ లవ్ స్టోరీ ‘గుర్తుందా శీతాకాలం’. కన్నడ సూపర్ హిట్టు ‘లవ్ మాక్ టైల్’ కు రీమేక్ వెర్షన్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.ఇందులో మరో ఇద్దరు బ్యూటీస్ నటిస్తున్నారు. అందులో ఒకరు కన్నడ బ్యూటీ కావ్యా శెట్టి అయితే.. మరో సుందరి కోసం ఇప్పటివరకూ అన్వేషించారు మేకర్స్.
ఎట్టకేలకు ఇందులో మరో హీరోయిన్ గా మేఘా ఆకాశ్ ఎంపికైన్నట్టు సమాచారం.‘లై, చల్ మోహన్ రంగా’ మూవీస్ తో ఈ బ్యూటీ.. తెలుగువారిని మెప్పించిన సంగతి తెలిసిందే. హీరో తన టీనేజ్ లవ్ స్టోరీని ఫ్లాష్ బ్యాక్ గా నెరేట్ చేయడం ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందిస్తుందని.. దానికి యూత్ అందరూ కనెక్ట్ అవుతారని దర్శకుడు నాగశేఖర్ అంటున్నాడు. సత్యదేవ్, తమన్నా పాత్రలకు సమాన ప్రధాన్యముంటుందట ఈ సినిమాలో. నాగశేఖర్ స్వీయ దర్శకత్వంలోనే తెరకెక్కుతోన్న ‘గుర్తుందా శీతాకాలం’ సినిమాకి మేఘా ఆకాశ్ స్ర్కీన్ ప్రెజెన్స్ ఏ మేరకు హైలైట్ అవుతుందో చూడాలి.











