దేశంలో కరోనా కేసులు పెరుగుదలతో పాటు మరణాలు కూడా అంతేస్థాయిలో పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రముఖులు, రాజకీయనాయులు, విద్యావేత్తలు ఒక్కొక్కరు కరోనాకు బలి అవుతున్నారు. తాజాగా భారతీయ వైద్య సంఘం (ఐఎంఏ) మాజీ అధ్యక్షుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కేకే అగర్వాల్ కన్నుమూశారు. కరోనాతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన అగర్వాల్ వెంటిలేటర్‌పై చికిత్స పొందారు. అగర్వాల్ అప్పటికే రెండు డోసులు తీసుకున్నారు. అయినాను కరోనా వెంటాడింది. సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన కరోనాపై ఎన్నో అవగాహన వీడియోలు చేసి ప్రజల్ని చైతన్యపరిచాడు. చివరకు కరోనాకు బలి కావడం అందరిన్నీ కలిచివేసింది. ఆయన మరణం పట్ల దేశవ్యాప్తంగా పలు వైద్య సంఘాలు నివాళులు ప్రకటించాయి. అగర్వాల్ మరణవార్త విని ఆయన సహచరులు కండితడిపెట్టారు.
Must Read ;- సినీ అభ్యుదయ గేయరచయిత అదృష్టదీపక్ కన్నుమూత











