ఇక్కడ, అక్కడ అని తేడా లేకుండా.. దేశమంతటా సోనూసూద్ సేవలు కొనసాగుతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీ వరకు.. ఏ చిన్న సాయం వచ్చినా సోనుసూద్ ను ఆశ్రయిస్తున్నారు. తాజాగా క్రికెటర్ హర్భజన్ సింగ్ సైతం సోనూసూద్ నుంచి సాయం పొందాడు. తనకు తెలిసినవారికి ఒకరికి రెండిసివర్ ఇంజెక్షన్ కావాలని దండం పెడుతూ సోషల్ మీడియా వేదికగా సహాయం కోరగా.. సోనూ సూద్‌ను అడగాలంటూ ఫాలోవర్స్ ట్యాగ్ చేశారు. వెంటనే స్పందించిన సోనూసూద్.. తప్పకుండా సహాయం అందుతుందంటూ భరోసా ఇచ్చేశారు. కర్ణాటకలో అవసరమైన వ్యక్తులకు ఇంజెక్షన్ అందుతుందని సోనూ చెప్పాడు. నీవు బాగుండాలి.. దేవుడి ఆశీస్సులు నీకు తప్పకుండా ఉంటాయని హర్భజన్ ట్వీట్ చేశాడు.
అండమాన్‌లో ఎగిరిన టీడీపీ జెండా..!
టీడీపీ,బీజేపీ కూటమి మరో ఘనత సాధించింది. అండమాన్ - నికోబార్ దీవుల్లో సత్తా...