మలయాళ యంగ్ సూపర్ స్టార్ నివీన్ పాలీ నటించిన తాజా యాక్షన్ మూవీ ‘తురముఖం’ (హార్బర్ ). రాజీవ్ రవి దర్శకత్వంలో సుకుమార్ తెక్కేపాట్ నిర్మాణంలో రూపొందిన ఈ పీరియాడికల్ డ్రామా.. 1923 – 1957 మధ్యకాలంలో కొచ్చీ హార్బర్ లో జరిగిన కొన్ని సంఘటనల సమాహారంగా రూపొందింది.
బ్రిటీష్ వారు పరిపాలించే కాలంలో ఒక హార్బర్ ను నమ్ముకొని జీవించే అమాయక ప్రజల జీవితాల్లోకి కొన్ని దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కొని.. ఆ ప్రజల పాలిట దేవుడవుతాడు ఒక యువకుడు. ఇంతకీ ఆ యువకుడు ఎవరు? అన్నది మిగతా కథ. త్వరలో విడుదలకు సిద్ధమైన ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. దీనికి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఇంతకు ముందెన్నడూ చూడని మేకోవర్ తో నివీన్ పాలీ అదరగొట్టాడు. టీజర్ లోని విజువల్స్.. ఈ సినిమా కథాంశాన్ని క్రిష్టల్ క్లియర్ గా కళ్ళకు కట్టాయి. ఇంకా ఈ సినిమాలో నిమిషా సజయన్, జోజు జార్జ్, మణికంఠన్, అర్జున్ అశోకన్, ఇంద్రజిత్ సుకుమారన్, సుదేవ్ నాయర్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. కె అండ్ షహబాజ్ అమన్ సంగీతం అందించిన ఈ సినిమాకి కథ, స్ర్కీన్ ప్లే డైలాగ్స్ .. గోపన్ చిదంబరన్ సమకూర్చారు. మరి తురముఖం సినిమా నివీన్ పాలీకి ఏ రేంజ్ ఇమేజ్ తెచ్చిపెడుతుందో చూడాలి.