బాక్సింగ్ అంటే ఎంతో పటిష్టంగా ఉండాలి. అదసలు అమ్మాయిలకు సాధ్యమయ్యేపనేనా.. ఇలా చాలా మంది అంటుంటారు. ముఖ్యంగా మన దేశంలో ఆటలు వంటికి ఆడవారికెందుకు అందునా బాక్సింగ్ లాంటివి అంటూ అంతా వెనక్కులాగే వారే ఎక్కువ. కానీ అందరి మాటలు తప్పని నిరూపించేలా కొందరు తమ ప్రతిభతో, శక్తితో అటువంటి వారికి తమ పంచ్ పవర్‌తో కళ్లు తెరుచుకునేలా చేయడంతోపాటు బంగారు పతకాల్ని అందుకుంటున్నారు. ఆ కోవలోకే వస్తారు మన సిమ్రంజిత్ కౌర్, మనీషా. తమ పంచ్‌లతో ప్రత్యర్ధులకు మట్టికరిపించి ‘బంగారు పతాకాన్ని’ భారత దేశ పతాకాన్ని బాక్సింగ్ ప్రపంచ కప్‌లో సగర్వంగా ఎగరేశారు.
జర్మనీలో జరుగుతున్న బాక్సింగ్ ప్రపంచ కప్‌లో భారతీయ లేడీ బాక్సర్స్ సిమ్రంజిత్ కౌర్ (60 కేజీల విభాగంలో), మనీషా (57 కేజీల విభాగంలో) బంగారు పతకాల్ని గెలిచి అందరినీ అబ్బురపరిచారు. పంజాబ్‌కు చెందిన సిమ్రంజిత్ 1995లో జన్మించారు. 2018లో మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌లో కాంస్య పతకం గెలిచి గుర్తింపు తెచ్చుకుంది. ఆపై 2020 బాక్సింగ్ ప్రపంచ కప్‌లో తన ప్రత్యర్ధి మయాను గెలిచి బంగారు పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక 22 సంవత్సరాల మనీషా హర్యానా, కైతల్‌లో 1997 లో జన్మించారు. 2019 లో ఏషియన్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌లో కాంస్య పతకంతో అందరి దృష్టిని ఆకర్షించిన మనీషా.. 2020 బాక్సింగ్ ప్రపంచ కప్‌లో బంగారు పతకాన్ని గెలిచి అందరినీ అశ్చర్యపరిచింది. 22 ఏళ్ల ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది.
వీరితో పాటు అమిత్ పంగల్, పురుషుల 25 కేజీల విభాగంలో బంగారు పతకాన్ని గెలిచారు. మొత్తంగా జర్మనిలో జరిగిన బాక్సింగ్ ప్రపంచ కప్‌లో భారత్ 3 బంగారు పతకాల్ని గెలివడంతోపాటు.. 2 రజతము, 4 కాంస్య పతకాలు తమ ఖాతాలో వేసుకున్నారు. మొత్తంగా 9 పతకాలను గెలుచుకున్నారు.