యంగ్ హీరో నాగశౌర్య వరుసగా సినిమాలు చేస్తూ.. కెరీర్ లో దూసుకెళుతున్నారు. ఈ లవర్ బాయ్ కాస్తా మాస్ మూవీస్, డిఫరెంట్ గా ఉండే మూవీస్ చేయాలనుకుంటున్నారు. అశ్వద్థామ సినిమాతో మాస్ ని కూడా మెప్పించగలను అని నిరూపించాడు. ప్రస్తుతం నాగశౌర్య విలువిద్య నేపథ్యంలో లక్ష్య అనే సినిమా చేస్తున్నాడు. కండలు తిరిగిన విలువిద్యకారుడిగా ఫస్ట్ లుక్ తోనే ఆకట్టుకున్నాడు. అలాగే వరుడు కావలెను అనే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కూడా చేస్తున్నాడు. ఇలా విభిన్న కథా చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న నాగశౌర్య, నందమూరి నటసింహం బాలకృష్ణతో కలిసి సినిమా చేయనున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.
ఈ మల్టీస్టారర్ మూవీకి నూతన దర్శకుడు శ్రీమాన్ వేముల దర్శకత్వం వహించనున్నారని.. ఈ సినిమాలో నాగశౌర్య మూగ, చెవిటి కుర్రాడిగా కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇందులో నాగశౌర్య పాత్రను చాలా ఫన్నీగా డిజైన్ చేశారట దర్శకుడు. అందుకే, ఆ క్యారెక్టర్ నాగశౌర్యకు బాగా నచ్చేసిందని అంటున్నారు. బాలయ్యకు కూడా ఈ కథ బాగా నచ్చిందట. ఆయన కూడా ఈ సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఇదే విషయం గురించి నాగశౌర్యను అడిగితే.. ఈ సినిమా కన్ ఫర్మ్ అని చెప్పడానికి ఇంట్రస్ట్ చూపించలేదు కానీ.. నో కామెంట్ అని చెప్పారు.
అయితే.. ఈ సినిమా యూనిట్ మెంబర్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ క్రేజీ మల్టీస్టారర్ కన్ ఫర్మ్ అయ్యిందని.. త్వరలోనే పూర్తి వివరాలతో నిర్మాణ సంస్థ ప్రకటించనుందని తెలిసింది. ఇందులో నాగశౌర్య పాత్రకు పర్ ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న క్యారెక్టర్ అట. అందులోను బాలయ్యతో కలిసి నటించే ఛాన్స్. కాదనకుండా వెంటనే ఓకే చెప్పాడు అంటున్నారు. మరి… అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ త్వరలోనే వస్తుందేమో చూడాలి.