కిషోర్ తిరుమల దర్శకత్వంలో స్రవంతి మూవీస్ “రెడ్” చిత్రాన్ని నిర్మించింది. ఇదిలావుండగా, హీరో రామ్ కొందరు టాలీవుడ్ దర్శకులను తన ఇంటికి ఆహ్వానించి మరీ మంచి డిన్నర్ ఇచ్చారు. వారిలో అనిల్ రావిపూడి, గోపిచంద్ మలినేని, కిషోర్ తిరుమల, సంతోష్ శ్రీనివాస్ వెంకి కుడుముల ఉన్నారు.,త్వరలో ముగియనున్న ఈ ఏడాది మనం తీసుకున్ననిర్ణయాలను ఆత్మపరిశీలన చేసుకోవడానికి అవకాశం ఇచ్చిందని తాను భావిస్తున్నానని రామ్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
కొత్త ఏడాది మంచి శుభారంభంతో, కొత్త ఆలోచలనలతో అందరికీ మేలు కలిగించాలని కోరుకుందామని రామ్ అన్నారు. కోవిడ్ మహమ్మారి కారణంగా చాలా కాలం పాటు ప్రజా జీవనం స్థంబించిపోవడంతో పాటు సినీ ప్రపంచం అతలాకుతలమైన సంగతి వేరుగా చెప్పనక్కరలేదు. షూటింగులు తిరిగి మొదలైన నేపథ్యంలో చాలాకాలం తర్వాత హీరోలు, దర్శకులు కలసి డిన్నర్లో ముచ్చటించుకుంటూ సంతోషంగా కబుర్లు చెప్పుకోవడం చిత్రపరిశ్రమ ఆహ్లాదభరిత పునః ప్రారంభంగా భావించవచ్చు.