వరస విలయాలతో ఇండోనేషియా భీతుల్లుతుంది. ఒకవైపు వరదల ధాటికి రోడ్లు తెగి, మట్టి కొండలు కూలి ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు.. మరోవైపు భూమి కంపించడంతో భవనాలు కూలి వందల మంది ప్రాణాలతో పోరాడుతున్నారు. ఇవి జరిగి కనీసం రెండు రోజుల కూడా జరగకముందే.. మరో విపత్తు ఎదురైంది. ఇండోనేషియాలోని తూర్పు జావాలో సిమేరు అగ్ని పర్వతం బద్దలైంది. అగ్ని పర్వతం పేలడంతో భారీగా బూడిద ఎగిసిపడుతుంది. చుట్టు పక్కల ఉన్న గ్రామాలను బూడిద కమ్మేసింది. ఇండోనేషియా అధికారుల సమాచారం ప్రకారం, ఆకాశంలో 5.6 కి.మీ. మేర బూడిద ఎగిసిపడుతుంది. ప్రాణ నష్టం, అస్తి నష్టం జరిగినట్టు సమాచారం అందలేదు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదేం కొత్తేమీ కాదు..
ఇదే కాదు ఇండోనేషియాలో దాదాపు 130 అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఈ సంవత్సరమే కాదు.. దాదాపు ప్రతి సంవత్సరం ఏదో ఒక అగ్ని పర్వతం ఇండోనేషియాలో బద్దలవుతూనే ఉంటుంది. ఇండోనేషియాలోని సినాబంగ్ అగ్నిపర్వతం 400 వందల సంవత్సరాల తర్వాత 2019, మే నెలలో పేలింది. ఇలాగే 2020, ఆగస్టు నెలలో సుమత్రా దీవుల్లోని ‘ మౌంట్ సినాబంగ్’ విస్పోటనం చెందింది. దీంతో సుమారు ఐదు కిలోమీటర్ల మీర ఎత్తు వరకు ఎగిసిన పొగ, బూడిదతో పరిసర ప్రాంతాలన్నీ నిండిపోయాయి. 2018లో సైతం సండ్రా స్ట్రెయిట్ సముద్రంలో అగ్ని పర్వతం బద్దలవ్వడంతో తీరం వైపు దూసుకొచ్చిన అలల ధాటికి 281 మంది ప్రాణాలు కోల్పోగా, 843 మంది గాయపడ్డారు.