RRR Review: నాలుగేళ్లుగా తెలుగు సినిమా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్ ఎట్టకేలకు వచ్చేసింది. థియేటర్లలో ఆర్ఆర్ఆర్ రిలీజ్ తర్వాత మాస్ జాతర కనిపిస్తోంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో రెండు పెద్ద ఫ్యామిలీలు నందమూరి, మెగా కాంపౌండ్‌ల నుంచి వచ్చిన స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో రాజమౌళి లాంటి దర్శకుడు సినిమా తీస్తే.. భాక్సాఫీస్ దగ్గర కనెక్షన్ల సునామీ రాకుండా ఉంటుందా?
కోవిడ్ తర్వాత సినిమాలు చూడటానికి జనాలు వస్తారా? రారా? అనుకున్న సమయంలో పుష్ప, అఖండ వంటి సినిమాలు కంటెంట్ ఉంటే చాలు.. థియేటర్స్ దగ్గర జనం క్యూలు కడతారు అని ప్రూవ్ చేశాయి.. ఈ క్రమంలోనే థియేటర్లలోకి వచ్చిన ఆర్ఆర్ఆర్ హిట్ అయ్యిందా? సినిమా ఎలా ఉంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఆర్ఆర్ఆర్ కథ విషయానికి వస్తే..
సినిమా కథలు అన్నింటిలోనూ మన పురాణ ఇతిహాసాలు కనిపిస్తూనే ఉంటాయి. ఆర్ఆర్ఆర్ సినిమా కథలో కూడా మన రామాయణం కథే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.. తండ్రికి ఇచ్చిన మాట కోసం రాముడు అడవులకు వెళితే.. ఈ సినిమాలో తండ్రికి ఇచ్చిన మాట కోసం.. బ్రీటీష్ వాళ్లలో కలిసిపోయి పోరాటం చేస్తుంటాడు A రాజు.. అల్లూరి సీతారామ రాజు.. రాజుగా రామ్ చరణ్ నటించారు..
ఇక జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో నటించారు. లంకలో ఉన్న సీతను వెతుక్కుంటూ వెళ్లిన రాములోరిలా బ్రిటీష్ దొరలో చిక్కుకున్న మల్లి అనే ఓ చిన్నపిల్లను విడిపించి తీసుకుని వచ్చేందుకు వెళ్లిన భీమ్.. కొమురం భీమ్.. ఉంగరం ఇచ్చి నేనొచ్చా అని సీతకు రాముడు చెప్పినట్లుగా.. ఈ సినిమాలో కూడా ఓ సీన్ అదేమాదిరిగా అనిపిస్తుంది.
నిజమైన ఫ్రీడమ్ ఫైటర్స్ క్యారెక్టర్స్ నుంచి స్ఫూర్తి తీసుకున్నట్లుగా రాజమౌళి ముందుగానే క్లారిటీ ఇవ్వగా.. కల్పితం కూడా నిజంగా జరిగిందేమో అన్నట్లుగానే కథను సింక్ చేశాడు దర్శకుడు. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ క్యారెక్టర్స్ రెండింటికీ కూడా సరైన న్యాయం చేశారు. ఎక్కడా కూడా ఒకరు తక్కువ మరొకరు ఎక్కువ అని సినిమా చూసినవారికి అనిపించదు..
సినిమాలో హైలెట్ విషయాలకు వస్తే.. మొదట రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్.. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా రామ్ చరణ్ ఎక్స్‌ప్రెషన్స్ మాములుగా లేవు.. కొమరం భీమ్ జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ అయితే నెక్స్ట్ లెవెల్.. ఎన్టీఆర్ పాత్ర ఇంట్రడక్షన్ సీన్ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఫారెస్ట్‌లో తీశారు. పులితో ఎన్టీఆర్ పోరాడే సీన్ స్క్రీన్ మీద నిజంగా రెండు పులులు ఉన్నాయా? అని అనిపిస్తుంది.
వారిద్దరి ఎంట్రీ ఒక లెవల్ అయితే, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ కలుసుకునే సీన్ మాత్రం నెక్స్ట్ లెవెల్.. అటువంటి ఐడియా అసలు రాజమౌళికి ఎలా వచ్చిందా? కచ్చితంగా ఆశ్చర్చపోతారు ప్రేక్షకులు.. తర్వాత తర్వాత ఇద్దరి మధ్య సెంటిమెంట్ సీన్లు.. భావోద్వేగాల్ని చాలా బాగా చూపించారు.. ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఇంటర్వెల్‌కి ముందు వచ్చే సీన్ కూడా మాములుగా లేదు.
ఇంటర్వెల్ సీన్ రాజమౌళి సినిమాల్లో ఎప్పుడూ హైలెట్‌గానే ఉంటుంది.. ఈ సినిమాలో కూడా అలాగే ఎక్కడా కూడా తగ్గేదే లే అన్నట్లుగా అనిపిస్తుంది.. జంతువులతో కలిసి ఎన్టీఆర్ బ్రిటీష్ వాళ్లపై చేసే యుద్ధం చూస్తుంటే మాములుగా ఉండదు.. తర్వాత భీమ్‌ని బ్రిటీష్ వారు పట్టుకున్న తర్వాత శిక్ష వేసే సమయంలో వచ్చే కొమురం భీమూడో అనే సాంగ్‌లో థియేటర్లో ప్రతీ ఒక్కరికీ గూస్‌బంప్స్ వచ్చేసింది.
క్లైమాక్స్ విషయానికి వస్తే.. నిప్పు, నీరు కలిసి యుద్ధం చేస్తుంటే ఎలా ఉంటుందో సరిగ్గా చూపించారు. క్లైమాక్స్‌లో అల్లూరి సీతారామ రాజు గెటప్‌లో రామ్ చరణ్ అద్భుతంగా కనిపించాడు. ఈ సినిమాలో ఒకటి తక్కువ.. ఒకటి ఎక్కువ అనేందుకు ఏమీ లేదు.. రాజమౌళి బాహుబలి తర్వాత మరోసారి తెలుగు సినిమా అంటే ఇది అని ప్రతీ తెలుగువాడు తొడగొట్టేలా తీశాడు..
నటీనటులు:
అలియా భట్ జూనియర్ ఎన్టీఆర్ మధ్యలో వచ్చే ఒక ఎమోషనల్ సీన్ బాగుంటుంది తప్ప హీరోయిన్లు ఇద్దరికీ పెద్దగా నటనకు స్కోప్ లేదు.. సినిమా మొత్తంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ మాత్రమే కనిపిస్తారు. రాహుల్ రామకృష్ణ నటన బాగుంది. అజయ్ దేవగణ్ ఫ్లాష్ బ్యాక్ ఆకట్టుకుంటుంది.
రాజమౌళి దర్శకత్వం:
ఇక సినిమాకి ఎన్టీఆర్, రామ్ చరణ్ నటన ఎంత హైలెట్‌గా నిలిచిందో.. రాజమౌళి దర్శకత్వం కూడా అంతే ప్లస్ అయ్యింది. అసలు రాజమౌళి కాబట్టే ఇద్దరు స్టార్ హీరోల్ని హ్యిండిల్ చెయ్యగలిగాడు..
ఇద్దరు సూపర్ స్టార్లతో సినిమాలు తీయటం అంటే మాటలు కాదు. వాళ్ల స్టార్‌డమ్‌కి ఇంపార్టెన్స్ ఇస్తూనే తన స్టైల్‌లో యాక్షన్ ప్యాకేజీని ప్రిపేర్ చేశాడు. దేశభక్తి అనే థ్రెడ్‌కు ప్రెండ్షిప్ అనే యూనివర్శల్ అప్పీల్‌ని యాడ్ చేసి నెక్ట్స్ లెవిల్‌కు తీసుకెళ్లాడు.
ముప్పై, నలభై కోట్లు మాత్రమే ఉండే తెలుగు సినిమా మార్కెట్‌ని వేల కోట్లకు తీసుకుని వెళ్లిన రాజమౌళి.. ఈ సినిమాని కూడా కచ్చితంగా రెండు వేల కోట్ల మార్క్ దాటించి బాక్సాఫీస్ బద్దలు కొట్టిస్తాడని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మొత్తానికి ఎన్టీఆర్.. రామ్ చరణ్ అనే రెండు అస్త్రాలను బాక్సాఫిస్ మీదకు గురి తప్పకుండా వదిలాడు రాజమౌళి..